స‌ర్వం సింగ‌పూర్ మ‌యం..!

సింగ‌పూర్ నామ‌స్మ‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం
ఇక ప‌రిపాల‌న‌లోనూ విదేశీ పెత్త‌నం
150 ఏళ్ల డేటాను స‌మ‌ర్పించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్: సింగ‌పూర్ పేరు చెబితే చాలు రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగం పుల‌కించిపోతోంది. క్ర‌మ క్ర‌మంగా అన్నింట్లోకి సింగ‌పూర్ ను ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల్ని పూర్తిగా సింగ‌పూర్ కి అంకితం చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాజాగా ప‌రిపాల‌న‌లోనూ సింగ‌పూర్ ను ప్ర‌వేశ పెడుతోంది.

అన్నింటా సింగ‌పూర్‌
ఆంధ్ర్రప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణం ప‌నుల్ని ఏక ప‌క్షంగా సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు ట‌క్కుల మారి విద్య‌లు ఉప‌యోగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో . .. ఇంకా చెప్పాలంటే భార‌తదేశంలో ఎక్క‌డా ఇంజ‌నీర్లే లేన‌ట్లుగా విదేశీ సంస్థ‌ల‌కు గుట్టు చ‌ప్పుడు కాకుండా నిర్మాణ ప‌నుల్ని అప్ప‌గించారు. వేల కోట్ల రూపాయిల విలువ చేసే భూముల్ని అప్ప‌నంగా అప్ప‌గించేందుకు రంగం సిద్దం చేశారు. దీనిమీద ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్ర‌భుత్వం నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రించింది.

ప‌రిపాల‌న‌లోనూ విదేశీ పెత్త‌నం
ఈ ప్ర‌గ‌తి పేరుతో రూ. 2 వేల 358 కోట్ల రూపాయిల‌తో ప‌రిపాల‌న ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వం చేపట్టింది. ప్ర‌భుత్వ శాఖల్లోని సిటిజ‌న్ ఛార్ట‌ర్ స‌హా స‌మాచార వ్య‌వ‌స్థ ను దీనికి అనుసంధానం చేయ‌నున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో విదేశీ సంస్థ‌ల్ని అనుమ‌తించ‌టం వివాదాస్ప‌దం అవుతోంది. దీన్ని బ‌ట్టి సింగ‌పూర్ కంపెనీలు నేరుగా ప‌రిపాల‌న‌లోనూ వేలు పెట్ట‌నున్నాయి.

వివ‌రాలు స‌మ‌ర్పించిన ప్ర‌భుత్వం
ఇప్ప‌టికే రాష్ట్రానికి సంబంధించిన 150 ఏళ్ల డాటాను ప్ర‌భుత్వం సింగ‌పూర్ కంపెనీల‌కు స‌మర్పించింది. అత్యంత విలువైన స‌మాచారాన్ని ప్రైవేటు సంస్థ‌ల‌కు అందునా విదేశీ సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేదు. దీని ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల సామాజిక ఆర్థిక  స్థితిగ‌తులు సింగ‌పూర్ గుప్పిట్లోకి చిక్కనున్నాయి. దీనిపై సర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

తాజా వీడియోలు

Back to Top