మహానేత సేవలు అజరామరం

ఆళ్లగడ్డ:

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సేవలు అజరామరమని   ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శ్లాఘించారు. పట్టణంలోని తన నివాసంలో ఏపీ వైయస్‌ఆర్ టీచర్సు ఫెడరేషన్ రూపొందించిన 2013 క్యాలెండర్‌ను ఎమ్మెల్యేతోపాటు ఆ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తులసీరెడ్డి, కార్యదర్శి సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి మాట్లాడుతూ తమ సమాఖ్య ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గౌరవాధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుదర్శనరెడ్డి, కార్యదర్శులు రాజశేఖర్‌శర్మ, ప్రసాదరెడ్డి, కోశాధికారి వెంకటేశ్వరరెడ్డి, సభ్యులు మహేష్, ప్రదీప్‌కుమార్, రాఘవేంద్ర, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
అలాగే, ఎస్టీయూ రూపొందించిన 2013 నూతన క్యాలెండర్‌ను కూడా శోభానాగిరెడ్డి ఆవిష్కరించారు. ఎస్టీయూ జిల్లా నాయకులు శ్రీనివాసులు, ఆళ్లగడ్డ నాయకులు బాలరాజు, పుల్లంరాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Back to Top