జగన్ సీఎం కావాలి: ఓ అంధుడి కోరిక


సత్తుపల్లి:

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు మాజీ  ఎమ్మల్యే అయిన వెంకట్రవుకు ఓ అంధుడు వ్యక్తం చేసిన కోరిక ఇది. ‘సార్.. జగనన్న సీఎం కావాలి.. ఆ రోజు కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం.. అప్పుడే వైయస్‌ఆర్ పథకాలు అందరికీ అందుతాయి’- అంటూ అతడు విన్నవించాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి నాగేశ్వరరావుకు చూపులేదు.  కాకర్లపల్లి గ్రామంలో జలగం వెంకటరావు పర్యటించినపుడు నాగేశ్వరరావు ఆయనను కలిసి ఈ విధంగా కోరాడు.  ఆ రోజు త్వరలోనే వస్తుందని వెంకటరావు అతనికి చెప్పారు. తొలుత కాకర్లపల్లి సెంటర్‌లోని వైయస్‌ఆర్ విగ్రహానికి జలగం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీడీపీ, కాంగ్రెస్‌కు రాజీనామా: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువులైన కాకర్లపల్లి గ్రామస్తులు కొందరితోపాటు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఈడ్పుగంటి రామకృష్ణ, కొప్పుల నాగేశ్వరరావు, కొత్తపల్లి నాగేశ్వరరావు, పొదిలి నర్సింహారావు, పమ్మి నర్సింహా రావు, కంపసాటి ప్రసాద్, బేతిని అప్పారావు, మోరంపూడి వెంకటేశ్వరరావు, పమ్మి సత్యనారాయణ తదితరుల నేతృత్వంలో వంద కుటుంబాలు రాజీనామాలు చేశాయి.  జలగం వెంకటరావు నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు వారంతా చెప్పారు.

Back to Top