ఇచ్ఛాపురం మదిలో…

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో చేసిన ఈ పాదయాత్రల ఆఖరి ఘట్టాలను చరిత్ర లిఖిస్తున్న అపూర్వ సంఘటనలను తనలో దాచుకున్న ఇచ్ఛాపురం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఎన్నో మహోన్నత జ్ఞాపకాలను, జ్ఞాపికలను తనలో దాచుకున్నది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం. మార్పులకు నాందీ ప్రస్తావనగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పాలనకు మారుపేరుగా నిలిచిన వైఎస్సార్ అధికారంలోకి రావడానికి ముందు జరిపిన పాదయాత్ర ప్రజాప్రస్థానం ఇక్కడే పూర్తి అయ్యింది. 68 రోజులపాటు 1473 కిలోమీటర్లు మండుటెండలో పాదయాత్ర చేసారు వైయస్సార్. చేవెళ్లలో మొదలై ఇచ్ఛాపురంలో ముగిసిన ప్రజాప్రస్థానాన్ని సూచిస్తూ విజయవాటిక పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించి, ఆవిష్కరించారు. ప్రజల మనసులు తెలుసుకున్న పాదయాత్ర అది. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడిని గద్దెనెక్కించిన పాదయాత్ర అది.

వైయస్ మరణం తర్వాత ఆయన కుటుంబంపై జరిగిన రాజకీయ కుట్రలు ఆయన కుమారుడు వైయస్ జగన్ ను జైలు పాలు చేసాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల పాలిట శాపంలా మారింది. ఆ సమయంలోనే తండ్రి వారసత్వాన్ని, అన్నగారి ఆలోచనను అందిపుచ్చుకుని మరోప్రజాప్రస్థానం పాదయాత్ర చేసారు షర్మిళ. 9 నెలలపాటు సాగిన ఈ మరో ప్రజాప్రస్థానం సైతం ఇచ్ఛాపురంలోనే చివరి మజిలీ చేరుకుంది. వైయస్సార్ విజయవాటికకు సమీపంలోనే షర్మిళ మరో ప్రజా ప్రస్థానం ముగింపు చిహ్నం విజయప్రస్థానం ఆవిష్కరించడం జరిగింది. కుట్రలను ఛేదిస్తూ రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పి షర్మిళ పాదయాత్ర చివరి అంకానికి ఇచ్ఛాపురమే వేదిక అయ్యింది.

తండ్రి అడుగుజాడల్లో సాగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ఇడుపుల పాయనుంచి ప్రజా సంకల్ప పాదయాత్రను ఆరంభించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తండ్రి  ఆశయాలను తన ఆచరణగా మార్చుకుని ఆయన సాగించిన పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది. 341 రోజుల పాటు 13 జిల్లాలలో సాగిన ప్రజాసంకల్పం తండ్రి,సోదరి మాదిరిగానే ఇచ్ఛాపురంలో ముగింపు దశకు చేరుకుంది. విజయసంకల్ప స్థూపంగా ఇచ్ఛాపురం గుండెల్లో మరో తీయని జ్ఞాపిక కానుంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో చేసిన ఈ పాదయాత్రల ఆఖరి ఘట్టాలను చరిత్ర లిఖిస్తున్న అపూర్వ సంఘటనలను తనలో దాచుకున్న ఇచ్ఛాపురం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రజలకోసమే నిరంతరం ఆలోచించే వైయస్సార్ కుటుంబం తమ కార్యాచరణకు చరితార్థ వేదికగా ఇచ్ఛాపురాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.

తాజా వీడియోలు

Back to Top