గోదారి పాదాలచెంత ఘనస్వాగతం

అపూర్వ స్వాగతం. గోదారమ్మ ఒడిలో యువనేతకు ఆత్మీయ ఆహ్వానం. రాజమహేంద్రి చారిత్రక రైల్ రోడ్డు బ్రిడ్జిపై మహాపాదయాత్రకునికి ఆహ్వానం పలికేందుకు తూర్పుగోదావరి జిల్లా సంసిద్ధంగా ఉంది. గోదారి హారతులు పట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రజలే కుటుంబంగా భావించే వైఎస్సార్ కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేయడం, ఆ ముగ్గురూ ఈ బ్రిడ్జిమీదుగా సాగడం ఓ మరువలేని ఘన చరిత్రే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం 2003 మే 17న రాజమహేంద్రవరం వారధిపై సాగింది. ఆయన తర్వాత ఆయన కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తూ 2013 జూన్ 4న ఈ వారధిపై నుండే తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. నేడు అదే కుటుంబం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ఇదే వంతెనపై సాగనుంది. ప్రజాసమస్యలపై పోరాడిన, పోరాడుతున్న ఏకైక కుటుంబం వైఎస్సార్ కుటుంబం. అదే కుటుంబం నుంచి ముగ్గురు నేతలు పాదయాత్రగా సాగిన చరిత్రను లిఖిస్తోంది రాజమహేంద్రి రైల్ కం రోడ్ బ్రిడ్జి.
యువనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమౌతున్నారు. గతంలో మహానేతను ఆదరంగా ఆహ్వానించి ఆ జిల్లా వాసుల ప్రేమభిమానాలు మరోసారి ప్రతిబింబించేలా స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్షనేత రాక సందర్భంగా బ్రడ్జి అంతా పార్టీ జెండాలు, తోరణాలతో శోభాయమానంగా తయారు చేసారు. యువనేత రాక గురించి విస్తృత ప్రచారం, ప్రజా సంకల్ప యాత్రకు పెరుగుతున్న అదరణ రీత్యా, వారధపై యువనేత తో కలిసి నడిచేందుకు వేలాదిగా ప్రజలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాకను ఆకాంక్షిస్తూ మరోవైపు ఫెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాట చేసారు. వివిధ హీరోల ఫాన్స్ సైతం యువనేతకు అభిమానులమేనంటూ నగరమంతా బానర్లు కట్టారు. వారధికి చివరగా భారీ పార్టీ జెండా ఈ ఆహ్వానానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 150 గుమ్మడికాయలతో మహిళలు యువనేతకు దిష్టితీసేందుకు, హారతిచ్చేందుకు ఎదురేగి రానున్నారు. కోటిపల్లి బస్టాండ్ ప్రాంగణంలో యువనేత స్వాగత సన్నాహాలకు భారీ వేదికను సైతం ఏర్పాటు చేసారు. డప్పులు, వాయిద్యాలు, గరగనృత్యాలు మొదలైన జానపద కళారూపాలతో, విద్యార్థినుల వీణాగానాలతో, తీన్మార్ డాన్సులతో తూర్పుగోదావరిలోకి రాజన్నబిడ్డకు ఘనమైన స్వాగతం జరగబోతోంది.  

 
Back to Top