గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టండి

ఎన్నికల ప్రచారాలు ఊపందుకుంటున్నాయ్...
పచ్చముఠాకు పచ్చి దొంగల ముఠా కూడా తోడైంది...
అందరూ కలిసి చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఒకటే...
జగన్ లక్ష కోట్ల అవినీతి....
ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టే వాస్తవాలు ఇవిగో.
రాజకీయ కురువృద్ధులుగా, మేధావులుగా, ప్రభుత్వ లోటుపాట్లు, న్యాయస్థానాల తీర్పులపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు జగన్ లక్ష కోట్ల అవినీతి ప్రచారంలో పావలా కూడా నిజం లేదని ప్రకటించారు. కేవలం 13 వందల కోట్ల పై
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసుల్లో ఐఏఎస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలకు సంబంధాలున్నాయంటూ పెట్టిన కేసుల్లో బలం లేదని తేలిపోతోంది. కొన్నాళ్ల క్రిందటే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై ఎలాంటి కుట్రకూ పాల్పడలేదంటూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇటీవలే మరో అధికారి డీ.మురళీధర్ రెడ్డికి కూడా హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై జరుగుతున్న సీబీఐ విచారణ నిలిపివేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 
మరో ఐఎఎస్ శాంబాబు పైన కేసును కూడా కోర్టు కొట్టేసింది. 
ఈడీ, సీబీఐ అనేక కేసుల్లో జగన్ పై విచారణ సాగిస్తూనే ఉంది. అయితే ఇందులో భాగస్వాములంటూ చేర్చిన పేర్లను న్యాయస్థానం పరిశీలించింది. ఈ కేసుల్లో అధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తల పాత్రలు ఉన్నాయనటానికి ఆధారాలు లేవని తేల్చింది. అంటే జగన్ పై కుట్రపూరితంగా కేసులు బనాయించినట్లు ఈ తీర్పులే స్పష్టం చేస్తున్నాయి.
క్విడ్ ప్రోకో అనీ, మనీ లాండరింగ్ అని అభాండాలతో అసత్య ప్రచారాలతో నిరాధారమైన ఆరోపణలతోనే వైఎస్ జగన్ ను 16 నెలలు నిర్బంధించారన్న విషయం ఈ కేసుల కొట్టివేతలతో బయటపడుతోంది. సరైన ఆధారాలే లేకుండా, క్విడ్ ప్రోకో జరగకుండా, ఆర్థిక నేరాలకు సాక్ష్యాలు లేకుండా ఓ నిర్దోషిని ఇన్నేళ్లుగా వేధిస్తున్న వ్యవస్థను చూసి ప్రజలు ఆగ్రహిస్తుంటే అందులో ఏమాత్రం తప్పులేదు. కానీ భారతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి, తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ అబద్ధాలని రుజువు చేసుకుని కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అవాస్తవాలనే అవాంతరాలు, అబద్ధాలనే అడ్డంకులను దాటుకుని మబ్బులు తొలగిన సూర్యుడిలా ప్రకాశించబోతున్నాడు. 
ఇక మిగిలిన మూడు ఛార్జ్ షీట్లు కూడా ఏమాత్రం బలం లేని, ఆధారం లేని ఆరోపణలే అని న్యాయవాదులు, న్యాయ పరిశీలకులు చెబుతున్నారు. త్వరలో ఆ కుట్రలనూ ఛేదించుకుని వైఎస్ జగన్ మచ్చలేని మనిషిగా బయటకు రాబోతున్నారంటున్నారు. కనుక ఇకపై ఎవ్వరూ లక్ష కోట్లు అవినీతి అబద్ధాన్ని అనడానికి అవకాశం లేదు. అలా అన్నవారికి తిప్పికొట్టగలిగే సమాధానాలు న్యాయస్థానమే అందించింది. గోబెల్స్ ప్రచారాలను తిప్పికొట్టేలా క్లీన్ చిట్ ఆయుధాన్ని అందించింది. 


 
 
Back to Top