ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఎగ్గొడుతారన్నదే మా భయం

()ప్రత్యేకహోదాపై  చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
()సొంత ఇమేజ్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారు
()హోదా కోసం తాము చేయని పోరాటం లేదు
()హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని తెలిసి కూడా బాబు అడ్డుకుంటున్నాడు
()ప్రధాని తలుచుకుంటే ఒక్కనిమిషంలో పనైపోతుంది

అసెంబ్లీః చంద్రబాబు తన సొంత ఇమేజ్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు.  48 గంటల్లో రూ.  4.67 లక్షల కోట్లు తెచ్చామని చంద్రబాబు కేంద్రమంత్రుల దగ్గర డంబాలు పలుకుతున్నారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. జరగనిది జరుగుతున్నట్లు చంద్రబాబు దేశానికి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని  జననేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం వల్ల ఏపీకి హోదా ఇవ్వాల్సిన పనిలేదు అనే పరిస్థితికి కేంద్రప్రభుత్వం వస్తే ఆపాపం చంద్రబాబుది కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 

ఇక్కడ సైన్ చేసిన ఎంవోయూలు మిగతా రాష్ట్రాల్లోనూ ఒప్పందాలు చేసుకుంటారని వైఎస్ జగన్  చెప్పారు. దీంట్లో 5 శాతం కూడా వాస్తవరూపం దాల్చదన్న సంగతి తెలిసిందేనన్నారు. అదే  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా వస్తే బాబు చెబుతున్న దానికి నాలుగింతలు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. మంత్రులు, బీజేపీ నాయకులు  చెబుతున్నట్లు తమకేమీ భయాల్లేవని..ఉన్నదల్లా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగ్గొడతారేమోనన్నదే తమ భయమన్నారు. అంతుకుమించి  వేరే భయాలేవీ లేవని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. 

తాము ప్రత్యేకహోదా కోసం చేయని పోరాటం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో, ఢిల్లీలో ధర్నాలు, దీక్షలు చేశాం. ఎంపీలతో వెళ్లి కేంద్ర పెద్దలను కలిశాం. యువభేరి పేరుతో ప్రతి జిల్లా తిరుగుతూ పోరాడుతున్నాం. ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నా అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.  ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని తెలిసి కూడా... చంద్రబాబు, అడ్డుతగులుతూ పోరాటాన్ని నీరుగారుస్తున్నారని  వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా అంశం వచ్చినప్పుడల్లా అధికారపార్టీ నేతలు చెప్పే మాటలు వింటుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని వైఎస్ జగన్ వాపోయారు.

ఒకరేమో హోదాను చట్టంలో పెడితే బాగుండేది అంటాడు. ఇంకొకరు  ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదంటాడు. ఇతర రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదని మరోసారి అంటారు. రాష్ట్రాన్ని విడగొట్టేరోజు ఇతర రాష్ట్రాలు లేవా అని జననేత ప్రభుత్వాన్ని కడిగేశారు.  రెండేళ్లలో ఏపీ రియార్గనైజేషన్ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించలేదు అని  వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సభలో నిలదీశారు. సీమాంధ్ర నుంచి తెలంగాణకు ఏడు మండలాలను తీసుకురావడం కోసం సవరణ చేయలేదా...? 50 మంది ఎమ్మెల్సీలను 58 మంది ఎమ్మెల్సీలుగా చేయడానికి సవరించలేదా? ఎమ్మెల్యే స్థానాలను పెంచుకోడానికి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఇద్దరూ మీరే  ఉన్నప్పుడు.. చట్టాన్ని ఈ అంశం కోసం సవరించలేరా? అని టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు. 

ప్రత్యేకహోదాను చట్టంలో పెట్టడానికి ఎవరు అడ్డుతగులుతున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హోదా ప్రధాని నిర్ణయం. ఎన్డీసీ, ప్లానింగ్ కమిషన్ , నీతిఆయోగ్ కు చైర్మన్ ప్రధాని.  కేబినెట్ అధ్యక్షుడు ప్రధాని. అలాంటి ప్రధాని తలుచుకుంటే నిమిషంలో జరిగే పని.
గత ప్రధాని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చి కూడా రెండేళ్లు అయ్యింది. 11 రాష్ట్రాలకు ఇప్పటికీ ప్రత్యేక హోదా కొనసాగుతున్నప్పుడు, మనకు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నా. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను సాధించుకోవడంలో చంద్రబాబుకు సిన్సియారిటీ, చిత్తశుద్ధి లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు . 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఉత్తరాఖండ్‌కు ఒక్క సంతకంతో ప్రత్యేక హోదా ఇచ్చేశారన్నారు. 
Back to Top