చంద్రబాబుకు తెలిసింది దోచుకోవడమే...

వైయస్‌ఆర్‌సీపీ నేత  గురునాథ్‌ రెడ్డి

శ్రీకాకుళంఃరాజకీయ అవసరాలు కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి విమర్శించారు.చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన కుటుంబం,టీడీపీ నేతలు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.చంద్రబాబు దోచుకోవడం తప్ప చేసిందేమి లేదని,పోలవరం పనులు చేయకుండా ఫొటోలకు పోజులిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అని అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుకెళ్లే సమర్థత ఉందన్నారు.నేడు అన్ని రాజకీయ పార్టీలు స్వార్థం, స్వలాభం కోసం పాకులాడుతున్నాయన్నారు.రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌ అని అన్నారు.అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషిచేస్తున్నారన్నారు.

Back to Top