దేవినేనికి దీటైన జవాబు...


ఏపీ జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ అనుకోకుండా అయినా ఓ నిజాన్ని ఒప్పుకున్నాడు. జైలుకెళ్లినా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన మారలేదు అని. నిజమే జగన్ ప్రవర్తన పూటకొకలా మారిందని ఎవ్వరూ అనలేదు. అనలేరు కూడా. ఎందుకంటే జగన్ చంద్రబాబు కాదు గనక. జగన్ కు చంద్రబాబులా పూటకో  మాట మార్చే అలవాటు లేదు కనుక. జగన్ చంద్రబాబులా యూటర్న్ లు తీసుకోడు గనుక...జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లినా మారలేదు. జగన్ ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. అదే వ్యక్తిత్వం. అదే మాటతప్పని మనస్తత్వం. అదే విలువలు గల రాజకీయాలపై నమ్మకం. అదే ప్రజలపట్ల విశ్వాసం. అవును వైఎస్ జగన్ ప్రవర్తనలో మార్పులేదు. 
ఓదార్పు యాత్ర నిర్ణయాన్నిఆపమని సొంత పార్టీ అధినేత్రి ఆదేశించినా అతడు మాటతప్పలేదు. తాను అన్నమాటకు కట్టుబడి ఉండాలనే పట్టుదలను మార్చుకోలేదు. 
485 రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించినా కాంగ్రెస్ తో రాజీపడలేదు. తన ఆత్మగౌరవాన్ని దిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టలేదు. విడుదల కోసం తన తీరు మార్చుకోలేదు.
డబ్బులు ఖర్చు చేసే కేండేట్లనే ఎంచుకోమని చెప్పినా, తొలినుంచీ నమ్ముకుని ఉన్నవాళ్లని అన్యాయం చేయలేనంటూ వారికే సీట్లిచ్చాడు తప్ప గెలుపుకోసం తన వైఖరి మార్చుకోలేదు. 
అబద్ధాలు ప్రచారం చేస్తే, రుణమాఫీ హామీని తానూ ఇస్తే గెలిచేసే అవకాశం ఉన్నా...అబద్ధాలు ఆడనంటూ, అసత్యాలు చెప్పనంటూ అదే మాట మీద నిలబడ్డాడు కానీ అధికారం కోసం అలవికాని హామీలిచ్చే మాయదారి నాయకుళ్లా మారిపోలేదు. 
ప్రతిపక్షంలోని 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడు. ఎమ్మెల్సీగా రాజీనామా ఇచ్చిన తర్వాతే శిల్పా చక్రపాణి రెడ్డిని జగన్ పార్టీలోకి ఆహ్వానించాడు. విలువలున్న రాజకీయాలు చేయడంలో జగన్ ధోరణి మారలేదు.
ప్రజల కోసం నిరంతరం పోరాడాలనే జగన్ ఆలోచన మారలేదు. 
ప్రజలపై అతడు చూపే అభిమానం మారలేదు.
హోదా కోసం అతడి ఉద్యమం మారలేదు.
విభజన హామీల కోసం అతడి పోరాటం మారలేదు. 
2019 ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించిన అతడి దమ్ము మారలేదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మాటతిప్పని, మడమ తిప్పని వైఎస్సార్ వారసత్వం ఇచ్చిన తెగువ మారలేదు. 
జగన్ ప్రవర్తనే కాదు, జగన్ పై జనాభిమానం మారలేదు. జనం లో యువనేతకు పెరుగుతున్న ఆదరణ మారలేదు. రాష్ట్రం నలుమూలలా ఆ యువనేతపై కురిపించే ప్రేమ మారలేదు. 
ఊసరవెల్లిలా రంగులు మార్చే చంద్రబాబుకు, ఒక్కమాటమీద నిలబడని తెలుగుదేశం పార్టీకీ, అవసరం కోసం అబద్ధాలు ఆడే పచ్చ నేతలకూ మారని వైఎస్ జగన్ వ్యక్తిత్వం చూస్తే విడ్డూరంగానే ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మార్చుకోని జగన్ ప్రవర్తన చూస్తే విసుగొస్తూనే ఉంటుంది. తమలా తమందరిలా తమ వారందరిలా జగన్ ఎందుకు లేడు అని  మంత్రి దేవినేని లాంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి చౌకబారు కామెంట్లతో తమ కడుపు మంట, నోటి దురద తీర్చుకుంటూ ఉంటారు. అయితే జగన్ లా తామంతా ఎందుకు లేము, జగన్ లా ఇచ్చిన మాటకు కట్టుబడి తమ నాయకుడు ఎందుకు ఉండడు, జగన్ లా ప్రవర్తన మార్చుకోకుండా నిఖార్సయిన మనిషిలా తమ పార్టీలో ఒక్కరూ లేరెందుకు అని ఆలోచించుకోవడం ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేతకు, ఇతర నాయకులకు ఇప్పుడు అత్యవసరం. 


 
Back to Top