సీఎం వైయ‌స్ జగన్‌.. ఆయనొక సక్సెస్‌ పాఠం 

(సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టినరోజు  సందర్భంగా  ప్రత్యేక కథనం)
 

చదువు పూర్తవగానే బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాజకీయాల కన్నా చాలా ముందే ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అక్కడా అదే పట్టుదల, ప్రతి విషయం తెలుసుకోవాలనే శ్రద్ధ, ఏకాగ్రత, సక్సెస్‌ కావడమే లక్ష్యం. లక్ష్యసాధన దిశలో ఆయన ఎంత కష్టానికైనా సిద్ధమయిపోయారు. కష్టపడ్డారు. విద్యుత్, సిమెంట్, మీడియా రంగాల్లో అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. ఆ క్రమంలో ఆయన దార్శనికత బాగా ఉపయోగపడింది. ముందుచూపుతో కూడిన నిర్ణయాలు కార్పొరేట్ రంగంలో ఆయననొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఆయన్ను సన్నిహితంగా గమనించిన కార్పొరేట్‌ రంగ నిపుణులు, కంపెనీల యజమానులు అదే విషయాన్ని పదేపదే చెబుతుంటారు.

ఆషామాషీగా వ్యాపార రంగంలోకి దిగలేదు..
వైయ‌స్ జగన్ ఏదో ఆషామాషీగా వ్యాపార రంగంలోకి దిగలేదు. అప్పుడాయనకు రాజకీయాలు ప్రయారిటీ కూడా కాదు. డీప్ స్టడీతో, లోతైన అవగాహనతోనే ఆయన బిజినెస్ రంగంలోకి దిగారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించారు. తెలుసుకున్నారు. క్షుణ్ణంగా గమనించారు. ప్రశ్నలు వేసి మరీ తెలుసుకున్నారు. ఆయన ప్రతి విషయాన్ని డీప్‌గా తెలుసుకుని నిపుణుల్ని అడిగేవారు. బిజినెస్ రంగంలో ఆయనకున్న అపారజ్ఞానం వల్లే ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేడు ఏపీ ముందంజలో వుంది. పరిశ్రమలు వస్తున్నాయి. ఏ పరిశ్రమలు ఎక్కడ అవసరం, ఎక్కడి పరిస్థితులు అనుకూలం, ఏ ప్రాంతానికి ఉపయోగం అన్న విషయాలను గమనింపులోకి తీసుకునే సీఎంగా పారిశ్రామిక విధానం తెచ్చారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు ల్యారస్ ల్యాబ్ సీఇవో చావా సత్యనారాయణ.

భారతి సిమెంట్స్‌ బెస్ట్ ఎగ్జాంఫుల్
వైయ‌స్ జగన్‌గారు గొప్ప విజనరీ అని చెప్పడానికి భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్. ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం. సాంకేతికత విషయంలో జగన్‌ది రాజీలేని ధోరణి. రీసెర్చ్ ఓరియెంటెడ్ మెంటాలిటీ. ఉపాధి అవకాశాల కల్పన జగన్గారి ప్రయారిటీ అంశం. భారతీ సిమెంట్స్ ఈరోజు సక్సెస్‌పుల్‌ వెంచర్ కావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ వైయ‌స్ జగన్ గారే అంటారు భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి.
 
లోతుగా తెలుసుకుంటారు..
వైయ‌స్ జగన్‌ గారు సిమెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేముందు వైయ‌స్ఆర్‌ గారి ద్వారా నాకు పరిచయమయ్యారు. తనకు ఏమీ తెలీదన్న  వైయ‌స్‌ జగన్.. చెప్పిందంతా ఎంతో శ్రద్దగా విన్నారు. మరోసారి చెప్పించుకున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఏ విషయాన్నయినా ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మేలన్నది జగన్ స్వభావమని.  పరిశ్రమల విషయంలో ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అందుకే నేడు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాల విషయంలో గొప్ప పేరు తెచ్చుకుంటూనే, దార్శనికుడిగా పరిశ్రమలకు ఊతమిస్తున్నారు. జగన్ హయాంలో కచ్చితంగా పారిశ్రామిక రంగం అభివృద్ది శిఖరాలు చేరుకుంటుందని నాకు గట్టి నమ్మకం అంటారు బిజినెస్ వ్యవహారాల నిపుణుడు ప్రసాదరెడ్డి.

అది సామాన్యమైన విషయం కాదు
ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకంగా, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమించి, పారిశ్రామికాభివృద్ధి సాధించడమన్నది సామాన్యమైన విషయం కాదు. అది ఏపీలో సీఎం వైయ‌స్ జగన్ సాధించి చూపారని సాగర్‌ సిమెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 2019 జూన్ నుండి 2022 జూన్ వరకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మూడేళ్లలో 30వేల 645 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మూడేళ్లలో రూ.47వేల కోట్ల 662కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది.

తాజా వీడియోలు

Back to Top