చెక్కు చెద‌ర‌ని ఉక్కు దీక్ష.. అంటే ఇదే మ‌రి!..

నో వెయిట్ లాస్‌..నీరు, అన్నం ప‌ది రోజులు  ముట్ట‌కున్నా అమ్మ‌తోడు అర గ్రామ్ బ‌రువు కూడా త‌గ్గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి?  రాజ్య‌స‌భ ఎంపీ సీఎం ర‌మేష్‌లా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయాలి. ఇదేంటి తిర‌కాసు అనుకుంటున్నారా?  చ‌ద‌వండి మ‌రి..
కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి   సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. అయితే రెండు రోజుల క్రితం బీటెక్ ర‌వి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయ‌న  దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. కాగా, సీఎం ర‌మేష్ ప‌ది రోజులుగా దీక్ష కొన‌సాగిస్తూన ఉన్నారు. ఆయ‌న‌కు ఇది వ‌ర‌కే బీపీ, షుగ‌ర్ ఉంది. అయినా స‌రే ప‌ది రోజులుగా ఏమీ తిన‌క‌పోయినా ర‌మేష్ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ దీక్ష‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌తి అర్ధ‌గంట‌కు ఓసారి ఆయ‌న విడిది రూంలోకి వెళ్లి వ‌స్తున్నార‌ని, ఆయ‌న తాగే వాట‌ర్ బాటిల్ ధ‌ర లీట‌ర్ రూ. 3 వేలు అంటున్నారు. ఇంత‌టి ఖ‌రీధైన నీరు తాగితే ఆక‌లి ఉండ‌దు..దాహం వేయ‌ద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి తోడు ఆయ‌న ఒక్క కేజీ కూడా బ‌రువు త‌గ్గ‌లేద‌ట‌. దీక్ష మూడో రోజు మెడికల్ రిపోర్టులో ర‌మేష్ బ‌రువు 77 కిలోల బరువు.5వ రోజు కూడా మెడికల్ రిపోర్టులో 77 కిలోల బరువే..9 వ రోజు కూడా 77 కిలోల బరువు ఇది ఎలా సాధ్యం అని డాక్ట‌ర్లే ఆశ్చర్య పోతున్నార‌ట‌.

‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య.త‌మ ఆశా..శ్వాస క‌డ‌ప ఉక్కు అని  ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం సిగ్గుప‌డాల్సిన విష‌యం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చిత్త‌శుద్ధి లేని టీడీపీ రాజ‌కీయాలు ప్ర‌జ‌ల‌కు ఎంతో చేటు..

తాజా వీడియోలు

Back to Top