నిరుపేద‌ల చ‌దువుకు చంద్ర‌బాబు గండం..!


హైద‌రాబాద్‌) విదేశీ ప్ర‌యాణాలు, ప్ర‌త్యేక విమానాల‌తో బిజీగా ఉన్న చంద్ర‌బాబు..నిరుపేద‌ల జీవితాల మీద ప‌గ ప‌ట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చ‌దువులకు అండ‌గా ఉండే వ‌స‌తి గృహాల మూసివేత‌కు క‌త్తి నూరుతున్నారు. దీంతో బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌కు చ‌దువు గండం రానుంది.

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల చ‌దువుల్లో హాస్ట‌ల్స్ కీల‌క పాత్ర పోషిస్తాయి. ప్ర‌తీ మండ‌లంలోనూ 3,4 చోట్ల ఈ హాస్టల్స్ క‌నిపిస్తాయి. వీటిలో భోజ‌న వ‌స‌తి, నివాస వ‌స‌తి క‌ల్పిస్తారు. పిల్ల‌ల‌కు స్తానికంగా ఉండే హాస్ట‌ల్స్ లో చ‌దువుకొనేందుకు అడ్మిష‌న్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో పిల్ల‌లు అక్క‌డ చ‌దువుకొంటూ ఉంటారు. ఈ హాస్ట‌ల్స్ లో ఉండే పిల్ల‌ల విద్యా ప్ర‌మాణాలు పెంచేందుకు గ‌త ప్ర‌భుత్వాలు చాలా చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

చంద్ర‌బాబు నాయుడు అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌యోగాల పేరిట బ‌డుగు విద్యార్థుల చ‌దువుల మీద క‌క్ష క‌ట్టారు. రేష‌న‌లైజేష‌న్ పేరుతో వ‌స‌తి గృహాల మూసివేత‌కు చ‌ర్య‌లుచేప‌ట్టారు. విద్యార్థుల్ని ద‌గ్గ‌ర‌లో ఉండే సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో చేర్పిస్తామ‌ని గొప్ప‌లు చెబుతున్నారు. అయితే వేల సంఖ్య‌లో ఉన్న విద్యార్థుల‌కు స‌రిప‌డా స్కూల్స్ లేవ‌న్న సంగ‌తి అందిరికీ తెలుసు. దీంతో విద్యార్థులు రోడ్డున ప‌డ‌నున్నారు. నిరుపేద‌ల చ‌దువుకు చంద్ర‌బాబు పెడుతున్న శాపం మీద నిరుపేద‌ల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. 
Back to Top