() వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు() అధికారం కోసం ఏమైనా చేసే వైఖరి() చంద్రబాబు నీచ రాజకీయాలపై మండి పడిన వైఎస్ జగన్ హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పిదాల మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ములతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, ఈ పనులకు స్పీకర్ నిస్సిగ్గుగా అండదండలు అందించటం మీద మండిపడ్డారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా చేసిన టాప్ టెన్ కామెంట్లు చూద్దాం.1. ఎన్నికల వేళ చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ అంటూ ఇచ్చిన సొమ్ములు వడ్డీలో మూడోవంతుకు చాలవు, అక్క చెల్లెమ్మలకు రుణమాపీ అని మూడు వేలు వేశారు. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. పిల్లలు అని చూడకుండా మోసగించారు. 2. చంద్రబాబు ప్రజల్లో చులకన అయ్యే పరిస్థితి. ఏపీ ని స్కీముల ప్రదేశ్ గా కాదు కానీ, స్కాముల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. 3. ప్రజల్ని మభ్య పెట్టేందుకు చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం అవినీతి సొమ్ముతో ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. 4. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబుకి హితవు పలికాను. కాస్తో కూస్తో సిగ్గు తెచ్చుకొంటారని మరోసారి చెబుతున్నాను. 5. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత అనేవి ముఖ్యం.6. చంద్రబాబు వ్యక్తితం ఏమిటి అంటే కుర్చీ కోసం ఎటువంటి గడ్డి అయినా తినే రకం. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే రకం అన్న మాట. 7. ఎన్నికలప్పుడు కుర్చీ కోసం అబద్దాలు చెబుతారు. తర్వాత ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబు విశ్వసనీయత. 8. చంద్రబాబుకి 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నుంచి 10 మందిని కొనుగోలు చేసుకొని తీసుకెళితే ఏం చేయలేరు. వీటని చూసి ప్రజలు ఓట్లేమీ వేయరు కదా9. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోయినందుకా, డ్వాక్రా మహిళలకు రుణమాపీ చేస్తానని చేయకపోయినందుకా, కేంద్రంలో మంత్రిపదవులు పంచుకొంటూ అక్కడ నుంచి హామీలను రాబట్టకపోవటంలోనా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పించనందుకో మాత్రమే ఓట్లేస్తారు. 10. ఈ రోజు చంద్రబాబు ఉండవచ్చు, రేపు నేను రావచ్చు. మరొకరు రావచ్చు. కానీ వ్యవస్థలు సక్రమంగా ఉండాలి. అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.