హైదరాబాద్: అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు పరిపాలనతో ప్రత్యేక హోదా కు ఆయనే అడ్డంకిగా నిలుస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సంగతి అర్థం చేసుకొనేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఎలా ఏర్పడుతోంది అనే విషయాన్ని గమనించాలి.<br/>దేశంలోని రాష్ట్రాలన్నీ ఒకే తీరుగా అభివ్రద్ది చెందలేవు. ప్రగతి కి సమాన అవకాశాలు ఇవ్వాలంటే అందుకు వెనుకబాటుతనంతో లేక సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి. ఇందుకోసం కేంద్రం పెద్ద మనస్సుతో సాయం చేయాలి. ఈ విదంగా ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వటం మొదలైంది. ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటు తనం చూసి, తర్వాత హిమాలయ రాష్ట్రాల వెనుకబాటు తనం చూసి ఈ హోదా ఇవ్వటం మొదలెట్టారు. <br/>రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ను కోల్పోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అలనాటు పార్లమెంటులో ఏకాభి్ప్రాయం కుదిరింది. అంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హంగులు ఆర్బాటాలు కోటలు దాటాయి. ప్రమాణ స్వీకారం చేసిన తీరు కానీ, తర్వాత పుష్కరాలకు ప్రచారం చేసిన విదానం కానీ జల్సాల వైభోగాన్ని చాటి చెప్పాయి. ఇక, ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు, ఆయన కోటరీ చేస్తున్న విదేశీపర్యటనలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజదాని శంకుస్థాపన పేరుతో 4,5 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేందుకు పూనుకోవటం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.<br/>ఒక వైపు ఈ విధంగా అప్పు చేసి పప్పుకూడు చేస్తున్న చంద్రబాబు.. ప్రత్యేకహోదా కోసం చిత్త శుద్దితో ప్రయత్నించటం లేదు. పైగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న తీరుతో కేంద్రం ఆర్తిక శాఖ అధికారుల్ని పిలిచి తలంటుపోసింది. దీంతో ప్రత్యేక హోదా రావాలంటే ఉండాల్సిన కనీస అవసరాల్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం పాటించటం లేదని తెలుస్తోంది.