తాపీగా కాపీలు

– ఏపీ అభివృద్ధి మొత్తం గ్రాఫిక్స్‌లోనే..! 
– అసెంబ్లీ నుంచి ఐటీ హబ్‌ వరకు అన్నీ కాపీలే
– బాబు రాగాలకు పచ్చ మీడియా భజనలు

‘ఇదిగో పులి అంటే అదిగో తోక..’ అన్నట్టుంది పచ్చ  మీడియా ప్రచారం. ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అని.. అసలు ఐటీ కంపెనీలను ప్రారంభించనేలేదు కానీ ఐటీ హబ్‌గా విజయవాడ అని మొదటి పేజీలో బ్యానర్‌ వార్త రాసేసి దానికి ఆకాశాన్ని తాకే పెద్ద అందమైన బిల్డింగ్‌ ఫొటో పెట్టేసి జనాన్ని మోసం చేయడానికి పథక చేసేశారు. చంద్రబాబు అనడం ఆలస్యం తబలా.. తంబూరి.. చిడతలు పట్టుకుని పచ్చ పత్రికలు పోటాపోటీగా రాసేయడం మొదలెట్టేశాయి. అయితే ఈ హడావుడిలో ఏం చేస్తున్నామో కూడా విచక్షణ మరిచిన పచ్చ పత్రికలు నెట్‌లో దొరికిన బిల్డింగ్‌ ఫొటో ఒక దాన్ని వేసేసి హడావుడిగా అచ్చు గుద్దేశాయి. విశాఖలో పదేళ్ల కిత్రమే ప్రారంభించిన సత్యం, విప్రో వంటి పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలకే దిక్కు లేదు కానీ కొత్తగా విజయవాడను ఐటీ హబ్‌గా మార్చేస్తానని బాబు డాంభికాలు ప్రదర్శిస్తున్నారు. దానికి పచ్చ మీడియా భజన చేస్తుంది. 

అసలా ఫొటో ఎక్కడిదంటే.. 
‘ఐటీ హబ్‌గా విజయవాడ’ పేరుతో ఈనాడు పత్రికలో మొదటి పేజీలో వేసిన ఆర్టికల్‌ తాలూకా ఫొటో తైవాన్‌ దేశంలోని తైపీ పట్టణంలోనిది. రెండు డీఎన్‌ఏలు పెనవేసుకున్నట్టు ఎత్తుగా వంపులు తిరిగి ఉండటం ఈ బిల్డింగ్‌ ప్రత్యేకత. ఈ బిల్డింగ్‌లో రెయిన్‌ వాటర్‌ హార్వెసింగ్‌ (ఇంకుడు గుంతల నిర్మాణం)ఉంటుంది. సూర్యరశ్మి బాగా సోకేలా నిర్మించిన ఈ భవనంలో ఎన్నో రకాల  మెడిసిన్‌ మొక్కలను కూడా పెంచుతుంటారు. ఇది పూర్తిగా నివాస సముదాయం. ఇందులో ఎలాంటి కార్యాలయాలు, వ్యాపార సంబంధమైన కార్యక్రమాలకు తావుండదు. ఈ బిల్లింగ్‌లో కింది నుంచి చివరి అంతస్థు వరకు అందమైన మొక్కలతో గ్రీనరీ కనిపిస్తుంది. అసలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో సంబంధమే లేని ఈ బిల్డింగ్‌ని ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించి ఘోరమైన తప్పులో కాలేశారు. చంద్రబాబు భజనలో చివరి దశకు చేరుకున్న ఈనాడు త్వరలో ఆనాడు.. ఈనాడు అనే పత్రిక ఉండేది. అని చెప్పుకునే స్థితికి రాబోతున్నట్టే కనిపిస్తుంది. 

పేరున్న కంపెనీ ఒక్కటీ లేదు.. 
పచ్చ మీడియా ప్రచారం ప్రకారం శుక్రవారం తొమ్మిది కంపెనీలకు విజయవాడలో ఒకేసారి చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పుకొచ్చారు. 500 మందికి ఉద్యోగవకాశాలు.. జూన్, జూలై నెలల్లో మరో అర డజన్‌ కంపెనీలకు శంకుస్థాపన చేస్తారని అప్పుడు మరో 1850 మందికి ఉద్యోగాలు వస్తాయని రాసుకొచ్చారు. అయితే ఈనాడు రాసిన కథనంలో ఒక్క ఎంఎన్‌సీ కంపెనీ కూడా లేదు. (యాక్సెల్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మో, అడాప్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్స్, అడ్వాన్స్‌ సాఫ్ట్, విన్‌టెక్, జోల్ట్‌ టెక్నాలజీస్, దామియన్‌ కన్సల్టెన్సీ) ఇవీ వారు చెప్పిన తొమ్మింది కంపెనీల్లో ఏడు ఐటీ సంస్థలు. 

భ్రమలు తొలగిపోతున్నాయి.. 
ఇన్నాళ్లు చంద్రబాబు ఏదో ఒకటి చేయకపోతాడా అని చూసిన ప్రజలకు రోజురోజుకీ ఆయన మీదున్న నమ్మకం పూర్తిగాపోతోంది. అద్భుతంగా చేస్తున్నామని పచ్చ పత్రికల్లో వార్తలు రాయించుకుని ఊదరగొట్టడం.. మూణ్నాలుగు రోజుల తర్వాత ఏదో ఒక డిజైన్‌ను కాపీ కొట్టేసి ఇదిగో అద్భుతమైన నిర్మాణం వచ్చేసిందని రాయించుకోవడం. అంతే..  క్షణాల్లో చంద్రబాబుకు నెటిజన్లు, వైయస్‌ఆర్‌సీపీ అభిమానుల నుంచి దిమ్మతిరిగిపోయే షాకులు. వారు ఎక్కడి డిజైన్లు కాపీ కొట్టారో వివరాలతో సహా ¯నెట్‌లో కనిపించేసరికి దిమ్మతిరిగి పోతున్నారు. గతంలో ఇలాంటివి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర పరిశ్రమల శాఖకు ఆయా రాష్ట్రాలు నివేదిక పంపించాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌ నుంచి దొంగిలించేసి తమదిగా చూపెట్టారు. ఈ విషయం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. దీంతో ఐటీ మంత్రి ఏపీ ప్రభుత్వానికి బాగానే చీవాట్లు పెట్టారు. అంతక కొద్దికాలం ముందే ఏపీ అసెంబ్లీకి డిజైన్లంటూ జపాన్‌కు చెందిన మాకీ సంస్థ ఇచ్చిన అణువిద్యుత్కేద్రం డిజైన్లపై చిన్నపాటి రాద్ధాంతమే జరిగింది. చివరికి చంద్రబాబు వాటిని మార్చాలని ఆదేశాలిచ్చారు. ఇదంతా ముగిసి బాహుబలి సినిమా రిలీజై హిట్‌ అవడంతో రాజమౌళిని పిలిచి చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రాజధానికి కూడా సెట్టింగ్‌ రూపకల్పన చేయాలని కోరారు. అందుకాయన నాలుగు నాలుగైదు నెలల సమయం అడిగినా అందుకు బాబు అంగీకరించారు. రాజమౌలితో అమరావతి నిర్మాణం ఉంటుందని మాహిష్మతి తరహాలో రాజధాని నిర్మిస్తారని అప్పట్లో పచ్చ మీడియా కర్ణభేరి పగిలిపోయేలా ఊదరగొట్టింది. అద్భుతం.. మహాద్భుత నిర్ణయం అని భజనతో వాయించేశారు. అంతే.. జనం మొత్తం ఫిక్సయిపోయారు. రాజమౌళి చేతుల మీదుగా మాహిష్మతి తరహాలో అమరావతి నిర్మాణం జరుగుతుందని. నాలుగైదు నెలలు గడిచాయో లేదో గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌. చంద్రబాబు మనసు మారింది. దర్శకుడు క్రిష్‌ను పిలిపించాడు. అమరావతి బాధ్యతలు క్రిష్‌కు అప్పగించాడు. ఇప్పుడు తాజాగా విజయవాడలో ఐటీ హబ్‌ అంటూ తైవాన్‌లోని తైపీ పట్టణంలో ఉన్న బిల్డింగ్‌ డిజైన్‌తో మరో కాపీ కథ రాసేశారు. చూడబోతుంటే చంద్రబాబు కాపీల చరిత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. 

Back to Top