చంద్రబాబా..అర డజను దొంగలు..


హైదరాబాద్) రాజధాని పేరు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కోటరీ గా చెప్పుకొనే ఐదారుగురు చేస్తున్న వ్యవహారాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రక్రియలో పరిపాలనపరంగా ఇన్వాల్వ్ అవుతున్న అధికారుల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ వాళ్ల కెరీర్ తో చెలగాటం ఆడుతున్నారు. దీంతో పరిపాలనలో రాజధాని వ్యవహారం అంటే అధికారులు హడలిపోతున్నారు.
అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే సింగపూర్ సంస్థలకు రాజధానిని మొత్తం దోచిపెట్టేందుకు చంద్రబాబు, ఆయన కోటరీ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే కోటరీలోని ముఖ్యుడు నారాయణకు పురపాలక శాఖను అప్పగించారు. కీలక సమయంలో గతంలో ఎప్పుడూ ప్రభుత్వంలో లేని వ్యక్తికి ఈ శాఖను అప్పగించటంపై అప్పుడే అనుమానాలు రేగాయి.కానీ, కోటరీ ముందు చూపుతో వ్యవహరించిందని తర్వాత తెలిసి వచ్చింది. సింగపూర్ తో లావాదేవీలన్నీ పూర్తిగా కోటరీ చేతుల మీదుగా  జరగటం విశేషం. అంతే గాకుండా సింగపూర్ సంస్థలకు కావాల్సిన సమాచారం కూడా నారాయణ ద్వారానే నడిచేటట్లుగా ఏర్పాటు చేసుకొన్నారు. 
మొదట్లో సింగపూర్ తో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవాలనా అప్పటి ముఖ్య కార్యదర్శి సాంబశివరావు చేతుల మీదుగా చేయించారు. ఒప్పందాలు తయారుచేయటం, దాని ప్రాతిపదికలు అన్నీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ తర్వాత ఆయనకే తెలిసేట్లుగా వ్యవహారం నడిపారు. సరిగ్గా ఆ దశ పూర్తి కాగానే ఆయన్ని టీటీడీ ఈవో గా బదలీ చేశారు. ఈ లోగా రాజధాని వ్యవహారాల కోసం క్రీడా సంస్థ ను ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా శ్రీకాంత్ ను నియమించారు. ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అంతా ఆయన పేరిట నడిపించారు. తర్వాత సింగపూర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, పర్యవేక్షణ కోసం నగర అభివ్రద్ది, నిర్వహణ సంస్థ ను ఏర్పాటు చేశారు. దీనికి మున్సిపల్ శాఖ కార్యదర్శి గిరిధర్ ను కమిషనర్ గా నియమించారు. ఈ మొత్తం వ్యవహారాలు ఆయన పర్యవేక్షించాక, ఆయన్ని బదలీ చేశారు. ఈలోగా నిధుల సమీకరణ, టెండర్ల వ్యవహారం కోసం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ ..ఐ అండ్ ఐ ను ఏర్పాటు చేశారు. దీనికి నాయకత్వం వహించే బాధ్యతను కార్యదర్శి ఠక్కర్ కు అప్పగించారు.
 మొత్తం మీద ఒక అధికారిని ఒక దశ దాకా ఉపయోగించి, మార్చేయటం ద్వారా వ్యవహారాలు మొత్తంగా ఎవరికీ అందకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజధాని వ్యవహారాలన్నీ చంద్రబాబు, ఆయన కోటరీ కనుసన్నల్లోనే ఉండేట్లుగా జాగ్రత్త పడుతున్నారు. 
Back to Top