కార్పొరేట్లకే ‘క్యాపిటల్‌ గెయిన్స్‌’

  • బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం
  • ప్ర‌త్యేక హోదా లేదు..ప్యాకేజీకి చట్ట‌బ‌ద్ధ‌త రాలేదు
  • టీడీపీ తీరుపై ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం
చంద్రబాబు ఏపీ ప్రజల గురించి ఏమనుకుంటున్నాడో తెలియదు గానీ డ్రామాలు మాత్రం ఆపడం లేదు. ఎన్నికల ముందు వరకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన బాబు తర్వాత ప్రత్యేక ప్యాకేజీ పాట పాడింది జనమందరికీ తెలిసిందే. తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగితే నిలదీయాల్సిందిపోయి కనీసం అసంతృప్తి కూడా వ్యక్తం చేయకుండా మంత్రులతోపాటు కొంత మంది రైతులను వెంట పంపించి పూల బొకేలకు గట్రా పంపి ధన్యవాదాలు తెలిపి మరోసారి ఏపీ ప్రజల పరువు తీస్తున్నాడు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, పోనీ బాబు చెప్పిన విధంగా ప్యాకేజీకి చట్టబద్దత అనే మాటే లేదు. విశాఖకు రైల్వే జోన్‌ రాలేదు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. రుణమాఫీ లేదు. ఏదీ లేకున్నా చంద్రబాబు మాత్రం మోడీ భజనలో తరించిపోతున్నాడు. తాజాగా క్యాపిటల్‌ గెయిన్‌ విషయంలోనూ చంద్రబాబు నిస్సిగ్గుగా భజన చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. 

రెండేళ్లతో రైతులకు ఒరిగేదేమీ లేదు
రాజధాని ప్రాంతంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయింపు కార్పొరేట్ల కోసమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. వివిధ కంపెనీలు భూముల కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఈ ట్యాక్స్‌ ఎగ్గొట్టేందుకు వేసిన ఎత్తుగడకు ప్రభుత్వం సహకరిస్తోందని రైతులూ అభిప్రాయపడుతున్నారు. నిజంగా రైతుల కోసమే ట్యాక్స్‌ మినహాయింపైతే కనీసం ఐదేళ్లయినా కాల పరిమితి ఇచ్చేవారే.  వెంటనే భూములు కొనుగోలు చేసుకునే వారి లబ్ధి కోసమే ఈ వ్యవహారం నడుపుతున్నారని అర్థమవుతుంది. సమీకరణకు భూములిచ్చి సర్వం కోల్పోయిన రైతులకు ప్రతిఫలంగా లభించే కొద్దిపాటి భూమి జీవితాంతం వారికి ఉపయోగపడేదిగా ఉండాలి. తాత్కాలిక అవసరాలు తీర్చుకునేదిగా ఉంటే, వారి జీవనమే ప్రశ్నార్థకమైపోతుంది. ఇలా ఆలోచించి రైతులు తమకు ఇచ్చిన భూమిని ఎక్కువ రేటు వచ్చినప్పుడు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. అందుకు పదేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రెండేళ్లే ఈ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం వెనుక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులున్నారనేది స్పష్టమవుతోంది. ఒకవైపు రైతులు నష్టపోతుంటే మరోవైపు కార్పొరేట్‌ కంపెనీలకు భూములు కట్టబెడుతూ వారికి ట్యాక్స్‌ మినహాయింపు పొందే విధంగా ప్రభుత్వం వ్యవహారం నడుపుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల క్రితమే సీఆర్‌డీఏ రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఒక సమావేశం నిర్వహించింది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములు అప్పగిస్తే త్వరగా అవి అభివృద్ధి  చెందుతాయని ఆ సమావేశంలో రైతులకు అధికారులు సూచించారు. అప్పట్లో రైతులు వ్యతిరేకించడంతో సీఆర్‌డీఏ అధికారులు కూడా మిన్నకుండిపోయారు.

రియల్‌ వ్యాపారులకే లబ్ధి
కేంద్ర ప్రకటించిన క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే ఉపయోగపడుతోంది. రాజధాని ప్రాంతంలో సుమారు 11,400 ఎకరాలు రైతుల నుంచి వ్యాపారుల చేతుల్లోకి మారి పోయింది. ఈ మొత్తం భూమిని వారు అమ్ముకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కూడా సదుపాయాల కల్పన రంగంలో కలిపేశారు. దీనివల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉపశమనం లభిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలు కూడా పన్ను మినహాయింపు కోసం భూములు కొనుగోలును ఉపయోగించుకునే వీలుంది. దేశంలోని పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడ భూముల కొనుగోలుపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, పెద్దఎత్తున భూ వ్యాపారం సాగే అవకాశాలుండొచ్చని పలు సంస్థలు నివేదికలిచ్చాయి. రాజధాని ప్రాంతంలో భూములు కొంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభాల పంట పండుతుందని అధికారులే చెబుతున్నారు. భూములు కొన్న కార్పొరేట్‌ కంపెనీలకు ట్యాక్స్‌ మినహాయింపు లభిస్తుంది. మల్టీ నేషనల్‌ కంపెనీలకు ఈ తరహా లబ్ధి ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కొనుగోళ్లు చేసే అవకాశాలున్నాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ కంపెనీలూ పెద్దఎత్తున భూములు కొనొచ్చని సీఆర్‌డీఏ అధికారులూ అంచనా వేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఎక్కువ మంది భూములు కొనగలిగితే ఆయా సంస్థలు నేరుగా కార్యకలాపాలు మొదలుపెడతాయని, అంతో ఇంతో పనులు మొదలవుతాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం రైతుల భూముల కంటే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉండి ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారివే ఎక్కువగా ఉంటాయి.  
Back to Top