బ్రీఫ్డ్‌మీ బాబు@ రెండేళ్లు

– ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని బాబు పలాయనం
– ఏపీకి దక్కాల్సిన ఆస్తులు తెలంగాణకు తాకట్టు
– కేంద్రాన్ని ప్రశ్నించలేక ప్రత్యేక హోదా తాకట్టు
-కేసుల భయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం
– ఏపీ ప్రజల పాలిట శాపంగా మారిన బాబు పాలన

నిద్ర లేచింది మొదలు.. పడుకునేదాకా, వేదికెక్కితే చాలు.., మైకు కనిపిస్తే ఆగడు.. గొప్పలు చెప్పుకోవడానికే వచ్చాడన్నట్టు, ఈ సందర్భం మిస్సైయి పోతే మళ్లీ రాదన్నట్టు. నీతి నిజాయతీలకు నిలువెత్తు సాక్ష్యం తానే అయినట్టు.. తనే స్వయంగా నిప్పునని ప్రచారం చేసుకుంటాడు. నిజానికి చేసేవాడెప్పుడు చెప్పడని సామెత. చంద్రబాబు విషయంలోనూ అంతే. బాబును గురిగింజ నీతి గుర్తుకొస్తుంది. గుక్కతిప్పుకోకుండా గొప్పలు చెప్పుకోవచ్చుగాక, కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పుకోవచ్చుగాక.. వేరే వారి గొప్పలని తనవిగా ప్రచారం చేసుకోని ఉండావచ్చును. కానీ ఎన్ని విషయాల్లో మేనేజ్‌ చేసినా చంద్రబాబును వెంటాడే కేసులున్నాయనేది నిజం. 

18 కేసుల్లో స్టేలు...
నిజాయతీ పరుడిగా, నిప్పుగా బాహ్య ప్రపంచంలో రోల్‌మోడల్‌గా తనను కీర్తించాలని తహతహలాడే చంద్రబాబు చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయనేది అందరికీ తెలుసు. నిజాయితీకి ప్రతిరూపంగా చెప్పుకునే బాబు తనపై వచ్చిన కేసుల్లో ఏనాడు విచారణ ఎదుర్కొన్న పాపాన పోలేదు. ఇప్పటికే ఆయనపై 18 వరకు కేసులుంటే తన మాయోపాయాలను ఉపయోగించి స్టేలు తెచ్చుకున్నాడే తప్ప విచారణకు హాజరై తనను తాను నిజాయతీ పరుడిగా నిరూపించుకున్న దాఖలాలు ఒక్క సందర్భం కూడా లేదు. దేశంలోనే పెద్ద లాయర్లను నియమించుకోవడం.. వారికి కోట్లకు కోట్లు గుమ్మరించడం.. న్యాయవ్యవస్థల్లో ఉన్న లోపాలను తనకు అనుకూలంగా మలుచుకుని విచారణకు రాకుండా చేసుకున్నవే ఆ 18 కేసులు. చంద్రబాబు తాను నిజాయతీ పరుడిననే నమ్మకం ఉంటే.. న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉంటే ఎప్పుడో విచారణకు అంగీకరించేవాడు. 

కేసుల కోసం రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు..
చంద్రబాబు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో  (మే 31) ఫోన్‌లో మాట్లాడుతూ ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. తన పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని స్టీఫెన్‌సన్‌ ఇంటికి డబ్బుతో పంపించిన వీడియో సాక్ష్యాలను ప్రపంచమంతా చూసింది. ఎమ్మేల్యేలను కొనుగోళ్లు చేస్తూ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ.. ఐయామ్‌ విత్‌ యూ.. డోంట్‌ బాదర్‌..,  అంటూ మాట్లాడిన బట్లర్‌ ఇంగ్లిష్‌ అందరూ విన్నారు. చంద్రబాబు దొరికిపోయాడని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాధారాలు అవసరం లేదేమో. నేషనల్‌ మీడియా ప్రతినిధులు చంద్రబాబును ఇంటర్వూ చేసినప్పుడు కూడా వాయిస్‌ నాది కాదని చంద్రబాబు చెప్పలేకపోయాడు. ఈ ఒక్క సంఘటన చాలు చంద్రబాబు ఈ కేసులో ప్రథమ ముద్దాయని చెప్పడానికి. సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రే అవినీతి సంపాదనతో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఎర వేసినా రాజీనామా చేయకుండా ఇంకా ఆయన సీఎంగా కొనసాగడం బాధాకరం.  ఓటుకు నోటు కేసులో ఇరుక్కోక ముందు హైదరాబాద్‌పై తనకు సర్వ హక్కులు ఉన్నాయని వాదించిన చంద్రబాబు మరుక్షణమే అమరావతికి పలాయనం చిత్తగించాడు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజీ కుదుర్చుకుని మూటా ముళ్లె సర్దుకుని అమరావతికి ప్రయాణం కట్టాడు. అప్పటిదాకా ఏపీ గుర్తుకురాని చంద్రబాబు నవ్యాంధ్ర అంటూ ప్రేమ ఒలకబోయడం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌లో ఏపీకి దక్కాల్సిన ఆస్తులన్నీ తెలంగాణకు రాసిచ్చాడు. కేసులో ఇరుక్కోక ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సంజీవని అని మాట్లాడిన చంద్రబాబు ఉన్నట్టుండి నాలుక మడతేశాడు. ప్రత్యేక హోదాతో అంతా అయిపోతాయా అని మాట్లాడాడు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయి తెలంగాణ, కేంద్రప్రభుత్వాలతో రాజీ పడిపోయాడు. విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ,  ఏపీకి అన్యాయం జరుగుతున్న పట్టించుకోకుండా ఇంకా మోసపూరిత మాటలతో  కాలం వెళ్లదీస్తున్నాడు. చంద్రబాబు మూడేళ్ల పాలన ఏపీ ప్రజలకు శాపంగా మారిందనే చెప్పుకోవాలి. 
Back to Top