బాబూ...జిల్లాలకిచ్చిన తాయిలాలేమయ్యాయి?

 

జిల్లాకో స్మార్ట్ సిటీ
అన్నాడు చంద్రబాబు - రాష్ట్రంలో ఎన్ని స్మార్ట్ సిటీలు తయారయ్యాయో చంద్రబాబుకే తెలియాలి. గ్రాఫిక్స్ లో అమరావతిని
భ్రమరావతిలా చూపించినట్టుగా సిటీలన్నిటినీ స్మార్ట్ గా గ్రాఫిక్స్ చేయించి చూపించేస్తాడేమో!

జిల్లాకో ఎయర్పోర్టు
అన్నాడు చంద్రబాబు - గన్నవరం, రాజమండ్రిలోని మధురపూడి, తిరుపతి, విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల పరిస్థితి
చూస్తేనే ఉన్నాం. విశాఖలో నిన్నటికి నిన్న ప్రతిపక్ష మీద హత్యాయత్నం జరిగేంత పటిష్టమైన భద్రత
ఉంది. ఇక మిగిలిన వాటి సంగతి చెప్పక్కర్లేదు. మరి కొత్త విమానాశ్రయలు ఎప్పుడు కట్టి ఎప్పుడు సర్వీసులు
ప్రారంభించేస్తారో ఆ పరమాత్ముడికే తెలియాలి.

జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్
యూనిట్లు అన్నాడు చంద్రబాబు. కొన్ని చోట్ల భూసేకరణ అని మొదలెట్టి మధ్యలో ఆపేసాడు. ఉన్నట్టుండి ఒకేసారి
ఇప్పుడు 35 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతార్ట. ఈ ఆహార శుద్ధి కర్మాగారాల్లో
ఎందరికి ఉపాధి దొరుకుతుందో తెలియదు? ఎందరు ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా వందల ఎకరాలు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కట్టబెడతారో చూడాలి.

జిల్లాకో ఫుడ్ పార్కు
అన్నాడు చంద్రబాబు -

జిల్లాకో నూతన పారిశ్రామిక
నగరం అన్నాడు చంద్రబాబు  - ఈలెక్కన సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి బినామీలతో అగ్గిపెట్టె కంపెనీలు ఎన్ని
పుట్టిస్తారో? ఒక్క హైదరాబాద్ లోనే వందల సంఖ్యలో బోగస్ కంపెనీలు పెట్టిన ఈ వ్యాపార వేత్తలు
జిల్లాకో నగరాన్ని ఇలా సృష్టించడంలో వింతేం ఉంది.

సముద్రతీరం ఉన్న ప్రతి
జిల్లాకూ ఓ పోర్టు - రాష్ట్రంలో అతిముఖ్యమైన విశాఖ పోర్టుకు అభివృద్ధిలేదు. ఎప్పటినుంచో ఉన్న కాకినాడ
పోర్టుకు ఎదుగూ బొదుగూ లేదు. ఏళ్లుగా నానుతున్న బందరుపోర్టుకు దిక్కూ దివాణం లేదు. కృష్ణపట్నం, భావనపాడు, కళింగపట్నం,

జిల్లాకో రకం యూనివర్సిటీలు
ఇస్తానని చెప్పాడు చంద్రబాబు - గిరిజనయూనివర్సిటీ, మెరైన్ ఇనిస్టిట్యూట్, తెగులు యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, కొరియన్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ
ఇలా రకరకాల యూనివర్సిటీలు ఏమయ్యాయో తెలియదు. అరకొర ప్రారంభమైనవి చూస్తే ఆల్రెడీ ఉన్న యూనివర్సిటీలో
ఓ బిల్డింగ్ లో పదుల సంఖ్యలో విద్యార్థులతో అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి.

జిల్లాకోఇనిస్టిట్యూట్లు-అకాడమీలు-హబ్ లు ఏర్పాటు చేస్తానన్నాడు
చంద్రబాబు - టెక్స్ టైల్ హబ్, టెక్స్ టైల్ క్లస్టర్ అన్నాడు. పత్తి రైతులకు మద్దతు
ధరేలేదు. టెక్స్ టైల్ క్లస్టర్లు ఎపిలో ఎక్కడ నుంచి వస్తాయ్. ఏ అకాడమీలు విద్యర్థులుకు
ఉపయోగపడేలా రాష్ట్రంలో ఉన్నాయ్? కొత్తగా ఏ హబ్ లు ఏర్పాటయ్యాయ్? ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్ టైన్మెంట్ హబ్, టూరిజం హబ్, టెక్నాలజీ హబ్, ఇన్నోవేషన్ హబ్, మెడికల్ హబ్, ఫిల్మీ హబ్, ఐటి హబ్ అబ్బో ఈ హబ్బులతో
సబ్బులు రుద్దేసి అబద్ధాల నురగలో ఆంధ్రాను ముంచేసిన ఘనుడు చంద్రబాబు.

చంద్రబాబుజిల్లాలకు ఇచ్చిన తాయిలాలు
అన్నీ మంచు ముక్కలే. అభివృద్ధి చేసే అపర మేధావి అని నమ్మినందుకు రాష్ట్రం మొత్తానికీ మిగిలింది
కన్నీళ్లు మాత్రమే.

 

 

 

Back to Top