బాబుకు ధైర్యం అప్పివ్వండి


ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధైర్యం కావాల్ట. అది కూడా ప్రజల నుంచే కావాల్ట. ఆయన దగ్గర ధైర్యం మచ్చుకైనా లేకుండా పోయిందనే ఆయనే చెప్పుకుంటున్నారు. ధైర్యం కావాల్సి వచ్చిందంటే అక్కడ భయం పుట్టిందనే కదా అర్థం. ఇంతకూ భయం ఎదుకు పుట్టింది? ఎవరిని చూస్తే భయం వేస్తోంది? అసలు బాబుగారి భయానికి కారణం ఏమిటి? వణుకుతూ వణుకుతూ నాకు ధైర్యం ఇమ్మంటూ చంద్రబాబు ప్రజలను ఎందుకు కోరుతున్నాడు? 
వరుస ఐటి దాడులపై చంద్రబాబు కంగారు చూసాం. ఈడీ, సిబిఐ పేరు చెబితే బాబు వణుకు గమనిస్తున్నాం. కక్షలు కుతంత్రాలు అంటూ దిల్లీకెల్లి చేసిన లొల్లీ చూసాం. ఇప్పుడిక బాబు నాకు ధైర్యం చెప్పండి, నాకు మద్దతిస్తున్నట్టు చప్పట్లు కొట్టి ప్రకటించండి అంటూ వేడుకుంటున్నాడు. తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బాబు బాగానే గ్రహించాడు. అయితే ఆ విషయాన్ని బింకంగా దాచిపెట్టి, చప్పట్లను అడిగి మరీ కొట్టించుకుని కొంతలో కొంత ఆత్మసంతృప్తి పొందాలని అనుకుంటున్నాడు. అందుకే నాకు ధైర్యం చెప్పండి అని అడుగుతున్నాడు. బాబుకు కావాల్సిన ధైర్యం ఏమిటంటే, దర్యాప్తు సంస్థలు టిడిపి అవినీతి మూలాలను వెలికి తీస్తున్నా, అక్రమార్జనల డొంక కదిలించినా, నల్లదనం తుట్టె కదిలించినా, బాబు అక్రమాలను సహించి, భరించి మళ్లీ బాబుకే మద్దతివ్వాలని. ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తులు బాబు గుమ్మందాకా వస్తే ప్రజలు వచ్చి అడ్డు నిలబడాలని. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, ప్రజలను, పాలనను వదిలి, ఆదాయాలు, ఆస్తులు పెంచుకోడంలో మునిగిపోయిన చంద్రబాబుకు నేడు దిక్కుతోచడం లేదు.

Back to Top