అమ్మ చంద్రబాబూ.. గవర్నమెంటు డబ్బులతో గేమ్ ఆడుతున్నావా..!


() దొంగచాటు గేమ్ లకు పెట్టింది పేరు
చంద్రబాబు

() ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం ఇదే
ఒరవడి

() చంద్రబాబు చర్యల మీద విమర్శల వెల్లువ

హైదరాబాద్) ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి, రాజకీయ పబ్బం గడుపుకోవటం
చంద్రబాబుకి అలవాటైన పని. ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు కూడా చంద్రబాబు
ఇదే ఎర వేస్తున్నారు.

అసలు స్ఫూర్తి

స్వర్గీయ
ప్రధానమంత్రి పీవీ నరసింహరావు హయంలో నియోజక వర్గాల వారీగా నిధులు ఇచ్చే సాంప్రదాయం
మొదలైంది. దీన్ని తర్వాత కాలంలో రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. అంటే ప్రతీ అసెంబ్లీ
నియోజకవర్గంలోనూ అభివ్రద్ధి పనుల కోసం కొంత నిధికి కేటాయించేవారు. ప్రతీ ఏటా
సంబంధిత ఎమ్మెల్యే సూచించిన పనులకు ఈ నిధుల్ని వెచ్చించేవారు. దీని ద్వారా ప్రజల
అవసరాలకు ప్రాధాన్యం దక్కుతుందన్నది అంతర్లీనంగా ఉన్న స్ఫూర్తి.

ఇందుకు అనుగుణంగా
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ విధానం మారలేదు. సరికదా, దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో
దీనిని అమలు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఈ నిధులు
విడుదల అవుతుంటాయి

బాబు దుర్మార్గ విధానాలు

ప్రతిపక్షాల గొంతు
నొక్కటంలో రాటు దేలిపోయిన చంద్రబాబు..ఇక్కడ కూడా తన వక్ర బుద్దిని ప్రదర్శించారు.
నియోజక వర్గ నిధుల్ని పేరు మార్చి ముఖ్యమంత్రి నిధి కింద మార్చేశారు. ప్రతీ
ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలోకి తొక్కేశారు. కేవలం
తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాలకే నిధులు ఇవ్వటం ప్రారంభించారు. తర్వాత
కాలంలో బాబు బాగోతం బయట పడింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం నాయకుల
పేరుతో నిధుల్ని విడుదల చేయటం మొదలెట్టారు. ఏ హోదా లేకపోయినా పచ్చ నేతలకు నిధులు
కట్టబెట్టసాగారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకో మాట

ఇప్పుడు చంద్రబాబు
మరోసారి అరాచకాన్ని బయట పెట్టుకొన్నారు. తెలుగుదేశం ప్రలోభాలకు లొంగిపోయి కొందరు
పార్టీ మార్చిన సంగతి తెలిసిందే. అటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇప్పుడు టీడీపీ
నాయకుల పేర్లు మార్చేశారు. సీఎం నిధుల్ని ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు
తాయిలాలుగా మార్చేశారు. దీంతో తాజాగా ఆయా నియోజక వర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల
పేర్లు బయట పడ్డాయి. మొత్తం మీద పార్టీ ఫిరాయింపులకు ప్రలోభాలకు గురి చేసేందుకు
కూడా ప్రభుత్వ నిధుల్ని వాడుకోవటం విమర్శలకు దారి తీస్తోంది. 

Back to Top