కులాల మధ్య బాబు చిచ్చు

ఎన్నికలప్పుడు ఏం చెప్పారు..?
ఇప్పుడేం చేస్తున్నారు బాబు..?
హామీలు అమలు చేయలేక..
కులాల మధ్య చిచ్చుపెడతారా
అధికారపక్షంపై ప్రతిపక్ష నేత ఫైర్

హైదరాబాద్ః  చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెడుతూ వారితో ఆటలాడుకుంటున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు గాండ్లను బీసీ-బి నుంచి ఎస్సీకి...ఆరె కటికలను బీసీ-డీ నుంచి ఎస్సీకి...కురుమ, కురబలను బీసీ-బి నుంచి ఎస్సీకి, వాల్మీకి, బోయిలను ఎస్టీల్లోకి మార్చేందుకు చర్యలు  తీసుకుంటామన్న టీడీపీ ...ఇప్పుడేమో పరిశీలిస్తామని మాట మారుస్తున్నదని తూర్పారబట్టారు. 

మధ్యలో ఛీప్ విప్ కాల్వశ్రీనివాసులు కలగజేసుకొని సబ్జక్ట్ తో సంబంధం లేకుండా మాట్లాడడంపై జననేత ఫైరయ్యారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు. ఆరోజు ఓట్ల కోసం హామీలు గుప్పించి.... ఓట్లు వేయించుకున్నాక వాటిని విస్మరించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా అంటూ ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు 33 శాతానికి పెంచుతామన్నారు.  10 వేల కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అదే హామీని అమలు చేయాలని కాపులకు ఆందోళన చేస్తుంటే  సహించలేకపోతుందన్నారంటూ అధికారపార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబుకు కేంద్రాన్ని వెళ్లి అడిగే ధైర్యం లేదు. కాపులకు- బీసీలకు, ఎస్సీ-ఎస్టీలకు మధ్య గొడవలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ చంద్రబాబు కులవివక్షత చూపించారని వైఎస్ జగన్ ఆగ్రహించారు.  మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనే అవుతానంటూ గురజాడకు సంబంధించిన కవితను వైఎస్ జగన్ ఈసందర్భంగా ప్రస్తావించారు. 

ఇక కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం కాదా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున జనాలు ఒక దగ్గర చేరితే...భావోద్వేగాలకు గురవుతారన్న సంగతి మీకు తెలియదా బాబు..? సభ పెట్టిన దగ్గరలో రైల్వేస్టేషన్ ఉన్న సంగతి సర్కార్కు తెలియదా..? ఆ రోజు అక్కడ సెక్యూరిటీని ఎందుకు పెట్టలేదు..? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  తుని ఘటనపై సీఐడీ విచారణ కాదని, సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా తాము కోరామని వైఎస్ జగన్ తెలిపారు. మాటిమాటికి వైఎస్సార్ ను ఆడిపోసుకుంటున్న టీడీపీ నేతలు... 1994లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాపుల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

Back to Top