దిల్లీ సాక్షిగా వంచనపై పోరు


దేశరాజధాని దిల్లీ. ఆ దిల్లీ నడిబొడ్డున నేడు ఓ ఆంధ్రుడి ఆవేదన నిరసగా వ్యక్తం
అవుతోంది. ఓ తెలుగువాడి ఆక్రోశం
నలుదిశలా ప్రతిధ్వనిస్తోంది.ఓ జాతీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ కలిపిచేసిన కుట్రకు, దగాకు మోసపోయి, వంచనకు గురై తమకు న్యాయం
చేయాలంటూ దిల్లీ గడ్డపై పోరాటం చేస్తోంది. తెలుగువాడి తోడుగా, తెలుజాతి జాడగా నిలిచి వంచనపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలే ఊపిరై ప్రజా
క్షేమమే ధ్యేయమై సాగే వైసీపీ నేడు ప్రజా ఉద్యమానికి గళమై నిలిచింది. కోట్లాది ఆంధ్రుల ఆకాంక్షలకు,ఆశలకు ప్రతినిధిగా 
పోరుజరుపుతోంది. ఇది అధర్మ పాలకుల అక్రమ
పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్ష. అధర్మ దీక్షల్లోని
కుటిలత్వాన్ని బయటపెట్టే దీక్ష. ఇది ఓ నాయకుడి నిర్విరామ
ఉద్యమవాహిని చైతన్యాన్ని రగిలిస్తున్న దీక్ష. వంచనపై పోరాటం ప్రత్యేక హోదా కోసమే కాదు ఆ హోదాను భూస్థాపితం
చేయాలని లక్ష ప్రయత్నాలు చేసి, చివరకు కుదరక ఆ హోదానే
రాజకీయ సాధనంగా మలుచుకునే కుట్రదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్ష కూడా. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో చోట్ల వంచనపై పోరాటం ఓ ఉద్యమంలా
సాగిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఉద్యమంలో సామాన్యులు
కూడా మేము సైతం అంటూ నినదిస్తున్నారు. నాలుగున్నరేళ్ల అబద్ధాలకు, మోసాలకు సమాధానం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు.

నాలుగేళ్ల వంచన

బీజేపీతో కలిసి ఎన్నికలకు వచ్చిన టీడీపీ విభజన హామీలపై తెలుగు
ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. మోదీని వెంటేసుకొచ్చిన
చంద్రబాబు ప్రత్యేక హోదాను 5ఏళ్లు కాదు 10ఏళ్లు కాదు 15ఏళ్లు కావాలంటూ కాకమ్మ
కబుర్లు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక
బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రత్యేక హోదాను నీరుగార్చాడు. కేంద్రం ప్రత్యే్క ప్యాకేజీ ఇస్తుంది. హోదా కంటే ఎక్కువ లాభం దాంతోనే ఉందంటూ కొత్తమోసాన్ని మొదలుపెట్టాడు. ఆనాడే ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తూ, హోదా మాత్రమే రాష్ట్రానికి రక్ష అని శాసన సభ సాక్షిగా బాబు
మోసాన్ని ఎండగట్టారు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆనాడు చంద్రబాబు ప్యాకేజీని వద్దంటూ ప్రతిపక్షాలు రాష్ట్ర
అభివృద్ధిని అడ్డుకుంటుంన్నాయంటూ ఆరోపణలు చేసాడు. కానీ నేడు అదే చంద్రబాబు బీజేపీ మోసం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని రాష్ట్రమంతా తిరుగుతూ దొంగపోరాట
దీక్షలు చేస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్నా అంటూ ప్రజలను నమ్మించే
ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఎన్డీయేలో భాగస్వామిగా
ఉన్న చంద్రబాబు హోదా విషయమే కాదు, విభజన హమీల గురించి
కూడా ఏనాడూ పల్లెత్తి ఒక్కమాట కేంద్రాన్ని అడగలేదు. రాజకీయ అవసరాలను తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్రపక్షాన్ని
నిలదీయలేదు. హోదా రాష్ట్రానికి
సంజీవని అని ప్రతిపక్ష నాయకుడు అంటే కాదని వాదించిన చంద్రబాబు, వైయస్ జగన్ హోదా ఉద్యమాన్ని విస్తృతం చేసి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో గతిలేక యూటర్న్ తీసుకున్నాడు. హోదా కోసం కేంద్రాన్ని నిలదీస్తూ, అవిశ్వాసానికి కలిసి వెళదామని కోరిన ప్రతిపక్షంతో ముందు సరేనన్న
చంద్రబాబు మర్నాటికే మాట మార్చి ప్రత్యేకంగా అవిశ్వాసం పెడతామని తప్పించుకున్నాడు. తాము అవిశ్వాసం పెడితే అన్ని పార్టీలూ కలిసి వస్తాయని చెప్పిన
బాబు పట్టుమని పదిమందితో అవుననిపించి అవిశ్వాసాన్ని నిలబెట్టలేకపోయాడు. ప్రధాని లేని సమయంలో సభలోనూ, ఆయన ఇంటి ముంగిట టీడీపీ ఎంపీల విన్యాసాలు చూసి భారతీయులంతా
నివ్వెర పోయారు. జాతికి ఆత్మగౌరవ నినాదాన్ని
వినిపించిన తెలుగు గడ్డపై ఇలాంటి చేవలేని, చేతకాని నాయకులు ఎక్కడ నుంచి వచ్చారా అని ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఏ నాయకుడికైనా రాజకీయ విలువలు ఉండాలని వైయస్ జగన్ అంటారు. ఆ విలువలున్న రాజకీయాలనే ఆయన చేస్తుంటారు. అందుకే చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి సంతలో పశువుల్లా
కొన్నప్పుడు సైతం సభలో వారి సభ్యత్వాన్ని రద్దు చేసి, ఏకకాలంలో ఆ  స్థానాల్లో
ఎన్నికలు నిర్వహించమని కోరారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సభా మర్యాదను కాపాడాలని, ప్రజాస్వామ్యానికి, ప్రజలు వేసిన ఓటుకు న్యాయం జరగాలనీ పోరాడారు. కానీ చెవిటివాడి ముందు శంఖం లాగా, గుడ్డివాడి ముందు దీపంలాగా మారిపోయిన న్యాయాన్ని సభలో సాధించలేమని
గ్రహించే ఆ యువనేత తన పోరాటాన్ని ప్రజల మధ్యకు మళ్లించారు. ఏ ప్రజల కోసం, ఏ ప్రజలు నమ్ముతున్న
ప్రజాస్వామ్యం కోసం శాసన సభలో అడుగు పెట్టారో ఆ ప్రజల కోసమే, ఆ ప్రజా స్వామ్యం బతకడం కోసమే తిరిగి ఆ సభను కాదని ప్రజల
మధ్య అడుగుపెట్టారు. ఇది జరిగి ఏడాది గడిచిపోయింది. అధికారం కంటే, చట్ట సభల్లో స్థానం
కంటే, అధికారిక మర్యాదల కంటే
ప్రజల మనసుల్లో స్థానమే స్థిరమైనది అని నమ్మిన నాయకుడు కనుకే అతడు ప్రజల బాట పట్టాడు. ప్రజలకు దారి చూపే దిక్సూచి అయ్యాడు.

తాను ప్రజల్లో ఉంటూనే మరోపక్క పార్టీ శ్రేణులతో ప్రజా సమస్యలపై
అలుపెరుగని పోరాటం నడిపిస్తున్నాడు. హోదా కోసం దీక్షలు, వంచనపై గర్జన, అగ్రిగోల్డు బాధితులకు
అండగానిరసనలు, ప్రభుత్వఅక్రమాలకువ్యతిరేకంగాఉద్యమాలుఇలాఅడుగడుగునా అతడి పోరు
సామాన్యుల కోసమే సాగుతోంది. సామాన్యుల పక్షమై ప్రజామద్దతును
సాధిస్తోంది. ప్రజా సమస్యల కోసం
ఎందాకైనా అంటూ ఆ నాయకుడు ఇస్తున్న పిలుపు అందుకుని అశేషంగా తరలి వస్తున్నాయ్ వైయస్సార్
కాంగ్రెస్ శ్రేణులు. ప్రజల కోసం ప్రజలతో
కలిసి సాగే ప్రతి ఉద్యమం, ప్రతి పోరాటం విజయవంతం
కావడానికి దీక్ష, దక్షతతో నడిపిస్తున్న
ఆ నాయకుడి ఆశయం ఒక కారణం. ఆ నాయకుడిపై కోట్లాది
మంది తెలుగు ప్రజలు పెట్టుకున్న నమ్మకం మరో కారణం. 

Back to Top