ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో పోలీస్ జులుం

ఆక్వాఫుడ్పార్క్ తో పచ్చని పంట పొలాలు, గ్రామాలు నాశనం

-తీర ప్రాంతానికి మార్చమంటున్న ప్రజలు

టిడిపి అరాచక పాలనకు మరో ఉదాహరణగా నిలిచింది తుందుర్రు ఆక్వాఫుడ్పార్క్. పచ్చనిపంట పొలాలను నాశనం 
చేస్తూ,
చుట్టూ ఉన్నప్రజల జీవితాలను 
కాలరాసే ఈ రావణకాష్టాన్నిబాధిత గ్రామాల ప్రజలుఎన్నాళ్లుగానో వ్యతిరేకిస్తున్నారు.

ఆక్వాఫుడ్ పార్కును  తీరప్రాంతానికి తరలించాలనే
డిమాండ్ తో  ఆయా గ్రామాలప్రజలు విజయవాడధర్నాచౌక్లో ధర్నా చేపట్టాలని 

నిర్ణయించారు. దీనికి సంబంధించి అనుమతులు సైతం పొందారు. కానీ అనూహ్యంగా పోలీసులు తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లోపెద్దఎత్తున బలగాలను మొహరించారు. విజయవాడ వెళ్లకుండా ప్రజలను అడ్డుకుని నిర్భందించారు. 

ఆక్వాఫుడ్పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని అన్యాయంగా అరెస్టు చేసారు. మూడు గ్రామలలో 

ఇళ్లలోకి వెళ్లి మరీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శాంతియుతంగా ధర్నాచేసేందుకు సిద్ధమైన వారిని, అనుమతులు కూడా పొందిన తర్వాత ప్రభుత్వం ఇలా పోలీసులను ప్రయోగించి నిర్భంధించడంతో గ్రామస్తులు

  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో  కూడాఈ  గ్రామాలవారుచేసిన ఆందోళనను ప్రభుత్వం పోలీసుల జులుంతో అణగదొక్కాలనే  ప్రయత్నించింది.

2016 అక్టోబర్ నెలలో కూడా ఫుడ్ పార్కు నిర్మాణ గ్రామాల్లో బ్రిటిష్ పాలనను తలపించేలా పోలీసు రాజ్యాన్ని నడిపింది సర్కార్.  

రెండు నెలలపాటు గ్రామాల్లో ఆంక్షలు విధించింది. ఎక్కడకు వెళ్లినా ప్రశ్నలు, ఆధార్, రేషన్ కార్డులు  చూపించమంటూ

 ఒత్తిడులు, పండగలు చేసుకోరాదని హెచ్చరికల మధ్య నాలుగు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీసారు.

ప్రజా ఆందోళనలను ఖాకీల బూట్లకింద నలుపుతున్న కిరాతక ప్రభుత్వాన్ని ప్రజలు శాపనార్థాలతో దుమ్మెత్తిపోస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top