అది ప్రచారమేనని మళ్లీ రుజువైంది


వైయస్ జగన్ పేరు చెబితే చాలు, అతనికున్న ప్రజాదరణ చూసి చెమటలు పట్టే పచ్చ బ్యాచ్ ఎప్పుడూ ఒక ప్రచారాన్ని భుజాన వేసుకుని తిరుగుతుంటారు. జగన్ చాలా ఆవేశపరుడని, అతని చేతుల్లోకి రాష్ట్రం వస్తే ఏదో అయిపోతుందని నోటికొచ్చిన పేలాపనలు బయటా, సభలోనూ పేలుతూనే ఉంటారు. కోట్లమంది ప్రజాభిమానం గెలుచుకున్న అతని నాయకత్వాన్ని చూసి తట్టుకోలేక నిత్యం ఏదో ఒక అసత్య ప్రచారాన్ని ఎత్తుకుంటారు. ప్రజలు ఆ కల్లబొల్లి మాటల్ని నమ్మే పరిస్థితి లేదని, వాళ్లు చెబుతున్నవన్నీ జగన్ ను ఎదుర్కోలేక ఎంచుకుంటున్న దొడ్డిదారులేనని అనేకసార్లు రూఢీ అయింది. తాజాగా జరిగిన సంఘటనపై జగన్ వ్యవహరించిన తీరు తెలుగు ప్రజలకు మరోసారి అతని ఆంతర్యం ఎంత గొప్పదో అర్థమయ్యేలా చేసింది. తనమీద హత్యాప్రయత్నం జరిగినా జగన్ బెంబేలెత్తిపోలేదు. అక్కడే విశాఖలోనే ఉండిపోయి, తన అభిమానుల ఆగ్రహావేశాలతో అశాంతి సృష్టించాలని కోరుకోలేదు.  బయటకొచ్చి నాపై హత్యాప్రయత్నం జరిగింది, ఇదంతా ప్రభుత్వం కుట్ర అని, తనను ప్రాణంగా ప్రేమించే అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నమూ చేయలేదు. 'అందరూ సంయమనం పాటించండి, మీ అభిమానం వల్ల, దేవుడి దయవల్ల  నేను క్షేమంగానే ఉన్నాను' అంటూ ప్రజల్ని శాంతపరచే ప్రయత్నమే చేశారు. అంతేగానీ జిత్తులమారి సర్కారు మాదిరిగా ఈ సంఘటనను ఎలాగైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయలేదు. ఉన్నదీ లేనిదీ మాట్లాడి సానుభూతి పొందాలనే ఆలోచన కూడా అతని దరిదాపులకు రానివ్వలేదు. ఈ కుట్ర వెనుక ఉన్నదెవరో ఎక్కడ బయటపడుతుందోనని నిప్పుగారితో సహా అందరూ కాళ్లు తొక్కేసుకుని, నోరు పారేసుకుని, ఢిల్లీకి పారిపోయి నానా యాగీ చేశారు, చేస్తూనే ఉన్నారు. జగన్ నిజమైన నాయకుడి లక్షణం చూపించారు. తనకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవం, ప్రజల క్షేమం పట్ల ఉన్న ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా నడచుకున్నారు. తన ప్రాణం మీదికి వచ్చినా సరే ప్రజలకు ధైర్యం చెప్పేవాడే కదా నాయకుడు. అలాంటి నాయకుడికి  ఇన్నాళ్లూ ఏదో ఒక బురదను అంటించే ప్రయత్నం చేసిన పచ్చ గ్యాంగ్ ఇప్పుడు కూడా అదే పని చేయబోయి బొక్క బోర్లా పడింది. ఎండ కడుక్కున్నా తమ బురద వదిలేది కాదని, అది ప్రజలే వదిలిస్తారని అర్థమైంది. జగన్ లోని ఎంతో పరిణితి గత నాయకత్వ పటిమ ప్రజలకు మరింత స్పష్టమైంది.


Back to Top