ఆప్యాయత.. అనురాగం కలబోత

ఆప్యాయ పలకరింపు.. ఓపికగా సమస్యలను వినడం.. ఆపై భరోసానివ్వడం.. ఇదీ వైయస్ షర్మిల పాదయాత్రలో ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు. ఆమె తీరు చూసి ప్రజలు ముగ్థులవుతున్నారు. సొంత ఆడబిడ్డ తమ ఊరికి వచ్చినట్లు భావిస్తున్నారు. తమ సమస్యలను ఆమెకు చెప్పకుంటూ ఆమె మాటలు విని ఉపశమనం పొందుతున్నారు. మంగళవారం సల్కాపురం, పెదపాడు గ్రామాలలో మహిళలతో మాట్లాడారు. వారితో సంభాషణ సాగిన తీరు ఇలా ఉంది.

షర్మిల: అక్కా బాగుండావా.. ఏమన్నా పంటలెలా ఉండాయి?
రైతు: ఎక్కడ బాగులేమ్మా! వానల్లేవు. గుడ్డి కరె ంటు. ధర లేదు. ఇత్తనాలు, ఎరువులు కొందామంటే డబ్బు దొరకదు. ఒక్క కష్టం కాదమ్మా. ఏట్లా బతకాల.

షర్మిల: రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండేదన్నా?
రైతు: మీ నాయన ఉన్నప్పుడు బాగుండేది త ల్లీ. వానలు కూడా అట్టే కురిసినాయి. కరెంటు కూడా బాగా ఇచ్చినారు. అప్పుడు 300 రూపాయలున్న ఎరువుల బస్తా ఎయ్యి రూపాయలైంది. పత్తి ధర అప్పుడు ఏడు వేలు. ఇప్పుడు మూడు వేయిలయింది. అన్ని ధరలూ పెరిగాయి.

షర్మిల: కరెంటు బిల్లులు ఎట్టున్నాయ్?
రైతు: వైయస్ దేవుడమ్మా. అప్పుడు 50 రూపాయలొచ్చే బిల్లు ఇప్పుడు 250. అది కూడా ఎప్పుడుంటాదో తెలదు. సానా కస్టంగుంది.

షర్మిల: ధైర్యంగుండన్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి పరిస్థితే ఇప్పుడుండాది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి సెప్పాల. అప్పుడే రాజన్న రాజ్యం వస్తాది. జగనన్న సీఎం అవుతాడు. కష్టాలూ తీరతాయి.

      మహిళలు, రైతులు, కూలీలు తనకోసం ఎక్కడ నిల్చున్నా... వారి దగ్గరికెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి బాధలు తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. మంగళవారం పెంచికలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర నాగులాపురం, సల్కాపురం, పెద్దపాడు మీదుగా కర్నూలు నగర శివారులోని సెయింట్ క్లార్క్ స్కూల్ చేరుకుంది. ఈ సందర్భంగా సల్కాపురం, పెద్దపాడులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతులే కాక, అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, రాజన్న రాజ్యం తిరిగొస్తుందని భరోసానిచ్చారు. అంతకు ముందు వేలాదిగా తరలివచ్చిన ప్ర జలతో కలిసి పెంచికలపాడు నుంచి పాదయాత్ర కొనసాగించారు. రహదారి వెంట వచ్చే బస్సుల్లోని జనం టాప్ పెకైక్కి ఆమెకు అభివాదం చేయగా.. షర్మిల కూడా ప్రయాణికులతో చేతులు కలుపుతూ.. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారివెంట యువతీ యువకులు కేకలు వేస్తూ సంఘీభావం తెలిపారు. మంగళవారం నాటి పాదయాత్రలో దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి షర్మిలతో కలిసి పాదయాత్ర చేశారు.

     పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో పాటు నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, మనోహర్, కొత్తకోత ప్రకాశరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్సీ యస్.వి. మోహన్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి, నంద్యాల ఇన్‌చార్జి ఎ.వి.సుబ్బారెడ్డి, బనగానపల్లి ఇన్‌చార్జి ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఇతర నాయకులు సుదర్శనం, రేణుకమ్మ, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, వెంకటకృష్ణా రెడ్డి, బి.రాముయాదవ్, ఎం.ఎల్.కాంతారెడ్డి, మహేందర్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డి, అత్తిరి గౌడ్, అరుణ కుమారి, రమాదేవి, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Back to Top