జై జ‌గ‌న్‌తెలంగాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబుపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత పెద్ద ఎత్తున బయటపడుతోంది. కూటమి రాజకీయాలతో కుట్రలు చేయాలనుకున్న బాబు భాగోతాలపై ఆగ్రహిస్తున్న ఎందరో సామాన్యులు తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత తమ గొంతును వినిపిస్తున్నారు. ప్రజలే కాదు ఇతర పార్టీల నేతలు సైతం చంద్రబాబు రాజకీయ నిర్వాకాలపై తమ గొంతు విప్పుతున్నారు. బాబును గద్దె దించేందుకు తమ వంతు ప్రయత్నం జరుగుతుందని పబ్లిక్ గా చెబుతున్నారు. 
జగన్ కోసం  పనిచేస్తానన్న అసదుద్దీన్
తెలంగాణా ఎమ్.ఐ.ఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. 2019లో ఎపీలోనూ బాబుకు పరాభవం తప్పదని తేల్చిచెప్పారు. జగన్ నా మిత్రుడు అని చెబుతూనే చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్నీ గుర్తుచేసారు. తెలంగాణా ఎన్నికల్లో బాబుకు దొరికిన సమాధానమే అందుకు నిదర్శనంగా చూపారు అసదుద్దీన్. రాజకీయాల్లో ఏమాత్రం నమ్మకూడని వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు మాత్రమే అని వాఖ్యానించారు అసద్. ఒకసారి బీజేపీ మరోసారి కాంగ్రెస్ ఇలా అవసరానికి పార్టీలతో పొత్తులు బాబుకు మాత్రమే సాధ్యం అన్నారు. తెలంగాణాలో చంద్రబాబు ప్రచారమే కాదు వందల కోట్లు ఖర్చు చేసాడని, అదంతా ఎపీలో సంపాదించి ఇక్కడి ఎన్నికలకు తరలించిన అవినీతి సొమ్ము కాదా అని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోనూ చంద్రబాబుకు అవే రెండు వేళ్లు మిగులుతాయని జోస్యం చెప్పారు అసదుద్దీన్. ఆంధ్రాలో జగన్ తరఫున తప్పక ప్రచారం చేయడమే కాదు ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో చంద్రబాబుకు చూపిస్తానన్నారు అసద్. 
తెలంగాణా ముఖ్యమంత్రి నోట ఎపి ఎన్నికల మాట 
నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎపిలో చంద్రబాబును ఓడించేందుకు తన వంతు కృషి చేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఎపి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోతున్నట్టు మీడియా సాక్షిగా తెలియజేసారు. తెలంగాణా ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని, ఇక ఏపీ వంతు మిగిలిందని అన్నారాయాన. ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లోనే రాబోతున్న సాధారణ ఎన్నికల్లో బాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ సర్వాత్రా నెలకొనింది. 
జగనే సీఎం అని బహిరంగ సభలో చెప్పిన హోంమంత్రి నాయిని
తెలంగాణా హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి సైతం ఎపిలో వైఎస్ జగనే సీఎం కాబోతున్నారని ప్రకటించారు. ఏపీలో చంద్రబాబు అడ్రస్ గల్లంతే అన్నారాయన. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి నామరూపాల్లేకుండా పోతుందని కూడా వాఖ్యానించారు. 
ఇంతమంది నాయకులు వైఎస్ జగన్ ను సపోర్టు చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఒక్కటే. వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో సాధించుకున్న అంతులేని అభిమానం. అతడివెంట సాగుతున్న అశేష జన ప్రభంజనం. ప్రజలు మెచ్చిన నేత జగన్ అని గుర్తించారు కనుకే వారంతా వైఎస్ జగన్ కు జై అంటున్నారు. ఇన్నేళ్ల వైసీపీ ప్రస్థానంలో కానీ, ప్రతికూల పరిస్థితుల్లో కానీ వైఎస్ జగన్ ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు కోసం ఆరాటపడలేదు. కనీసం మద్దతిమ్మని కూడా కోరలేదు. ఏ పార్టీ నాయకుడి ముందు సాగిలపడలేదు. ప్రజా సమస్యలకోసం తప్ప ప్రభుత్వాధినేతలతో చర్చలు జరపలేదు. తనకు అన్యాయం జరిగినప్పుడైనా ఏ పార్టీతోనూ రాజీపడలేదు. అక్రమ కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పినా న్యాయాన్ని నమ్మాను, దైవాన్ని నమ్మాను అన్నాడు తప్ప ఏ వ్యవస్థనూ మేనేజ్ చేయాలని ప్రయత్నించలేదు. అతడి నిజాయితీకి, అతడి ఆత్మవిశ్వాసానికి, ప్రజలపై అతడు పెట్టుకున్న నమ్మకానికీ దక్కిన అపూర్వమైన బహుమతే ఈ అఖండ ప్రజాభిమానం. ఈ అసామాన్యమైన నాయకుల సమైఖ్యమద్దతు గళం. నేడు ఎందరో నేతలు తమంతట తాముగా వైఎస్ జగన్ వెంట నడుస్తామని చెబుతున్నారు. ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిరంతరంగా చేసిన పోరాట ఫలితం. రానున్న సంచలనాత్మక మార్పులకు నాందీవాక్యం. 
 

తాజా వీడియోలు

Back to Top