వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి శివకుమార్‌ శాశ్వత బహిష్కరణ


హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ మద్దతు ఇవ్వడం లేదు. ఇది పార్టీ అధికారిక విధానం. ఈ విధానాని పార్టీ ఇంతకు ముందే ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశం మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లు ఆత్మ సాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా పార్టీ తెలంగాణ జనరల్‌ సెక్రటరీగా ఉన్న కే. శివకుమార్‌ ఓ ప్రకటన చేశారు. పార్టీ లెటర్‌ హెడ్‌ ఉపయోగించి కే. శివకుమార్‌  ఇచ్చిన ప్రకటనను తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా భావించి పార్టీ క్రమశిక్షణా సంఘం అత్యవసరంగా చర్చించి ఆయన్ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Back to Top