<br/><strong>శ్రీకాకుళం:</strong> తెలుగు రాష్టాల్లోని క్రైస్తవులందరికీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవన ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని వైయస్ జగన్ అన్నారు. <br/><br/>