విజయమ్మ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్, 10 ఏప్రిల్‌ 2013: ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాలలో ఉన్న తెలుగువారికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం శ్రీ విజయనామ సంవత్సరంలో రాష్ట్రాభ్యుదయాన్ని కోరే ప్రజా శక్తులకు అన్నింటా విజయం చేకూరాలని ఆమె బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఆకాంక్షించారు.

నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని, పాడి పంటలు వర్ధిల్లాలని, రైతులు, పల్లెలు కళకళలాడాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు. రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి సాధించాలని, వృత్తులన్నీ  వృద్ధి చెందాలని, సంక్షోభాలన్నీ తొలగిపోవాలని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
Back to Top