స్పీకర్ :వాసిరెడ్డి పద్మగారు -మార్చి19,2012

కోవూరులో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ నాయకులు కూడా అంగీకరీస్తున్నారు. రాజకీయాలలో  విలువలకు,విస్వశనీయతలకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ టి.డి.పి. నాయకులు కోవూరులో కోట్ల రూపాయలు పంచారు. వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ మద్యం డబ్బులు పంచకుండా వాటికి వ్యతిరేఖంగా పనిచేస్తుంది. రాజకీయాలలో విలువలను పెంపొందించేకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ది హిందూ దినపత్రిక ఎవరి పక్షాన నిలబడని పత్రిక చెప్పిన ప్రకారం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఓటుకు వెయ్యి రూపాయలు పంచారు. వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  ఎక్కడ డబ్బులు,మద్యం పంచకుండా కేవలం ప్రజాభిమానం మీద గెలవాలని వాటిని దూరం పెట్టింది. కడప ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు డబ్బు కర్చు పెడతారని ప్రచారం చేశారు. డబ్బు కర్చుపెట్టకపోయేసరికి జగన్ మోహన్ రెడ్డి డబ్బు ఉండి కూడా పంచడం లేదు అని ప్రచారం చేశారు.

కొవూరు ఉపఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 12 నుండి 15కోట్ల వరకు ఖర్చుపెట్టింది.కాని తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థాయిలో ఖర్చు పెట్టిందంటే ఆ నిధులు ఎక్కడ నుండి సమీకరిస్తుంది అనేది తెలియాల్సిఉంది. తెలుగుదేశం పార్టీ కోవూరులోను అలాగే తెలంగాణాలో కోట్ల రూపాయలు కర్చుపెట్టింది. ఇంత డబ్బు ఆ పార్టీలకు ఎక్కడ నుండి అందుతుందో వారు సమాధానం చెప్పాలి. ఈ నెల 21వ తేదీన వచ్చే ఉపఎన్నికల ఫలితాలలో అన్ని పార్టీలు గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. భారీ మెజార్టీతో కోవూరు సీటు గెల్చుకోవడమే గాక వచ్చే 17 ఉపఎన్నికల్లో కూడా ఇదీ మెజార్టీ పునరావ్రుతమవ్తుంది. ప్రజలను డబ్బుతో కొనాలనుకొనే కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలకు కోవూరు ఉపఎన్నిక ఒక చెంపపెట్టు అవతుందని తెలియచేస్తున్నాం.

ది హిందూ దినపత్రిక వ్రాసినటువంటి రిపోర్ట్లో కోవూరులో డబ్బు పంచడంలో కాంగ్రెస్ టి.డి.పి. పార్టీల కంటే వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ వెనకబడిఉందని వ్రాసారు. దీని ద్వారానే అర్ధమవుతుంది వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచలేదు అని.

Back to Top