స్పీకర్:శ్రీకాంత్ రెడ్డి,అమర్ నాథ్ రెడ్డి,గుర్నాథ్ రెడ్డి,బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి -మార్చి21,

ఈ రోజు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల ప్రెస్ మీట్ లో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ మాజీ ఏమ్మేల్యేలు శ్రీకాంత్ రెడ్డి గారు,అమర్ నాథ్ రెడ్డి గారు ,గుర్నాథ్ రెడ్డిగారు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు క్రింది విధం గా మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు లో  భారీ మెజార్టీతో గెలవడం పార్టీ కి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజాసంకల్పానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ లకు ఇది ఒక చెంప పెట్టు లాంటిది. ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్న తీరు ఓ దుష్టసంప్రదాయం లాంటిది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అసెంబ్లీని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారు.రైతులని సామాన్య ప్రజలని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కొవ్వూరు లో  భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ప్రజలను మభ్యపెట్టి వైయస్ఆర్  కాంగ్రెస్పార్టీ కార్యకర్తలను బెదిరించి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసినా ప్రజలు వైయస్ఆర్  కాంగ్రెస్ను గెలిపించ్చారు.ఇదే కాదు రాభోయే బైఎలేక్షన్స్లో  కూడా ఇంతకంటే భారీ మెజార్టీతో వైయస్ఆర్  కాంగ్రెస్పార్టీ గెలుస్తుంది.మేము నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్పార్టీకి వ్యతిరేఖంగా ఓటు వేశాం. వచ్చే 17 ఎన్నికల్లో కూడా గెలిచి నిజమైన ప్రతిప్రక్షంగా ప్రజలతరుపున పోరాడుతాం.

ఈ రోజు జరిగిన ఫలితాలతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఘోరపరాజయం పాలయ్యాయి.కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు  మాత్రమే రాష్ట్రంలో ఉండాలని మూడో పార్టీని ఎదగనీయకుండా చేయాలనీ ఒక దురుద్దేశం తో ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి.కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టిన ప్రజలు వారిని నమ్మలేదు. మేము రైతుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటువేశాం. మా రాజీనామాలను ఆమోదించడానికి చాల జాప్యం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎంత మంది బురద జల్లిన ప్రజలు పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గాని వెంట నడవడం ఇంత భారీ మెజారిటీ అందించడం మేము ఘనవిజయంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారినే నమ్మారు.

వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈనాడు రామోజీరావుగారు,అంధ్రజ్యోతి రాధకృష్ణ గారు,రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,పీ.సీ.సీ. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణగారు,చిరంజీవి గారు ఇప్పటికైనా బుద్హి తెచ్చుకొని ప్రతిరోజు రాసే అబద్దపు రాతలు దుష్ప్రచారం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రజలు తమ అవసరాలు తీర్చే నాయకులను ఎన్నుకున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికరుచుకపోయింది. ముఖ్యంగా నెల్లూరు ఆనం సోదరులు గోతికాడ నక్కలాగా కిరణ్కుమార్ రెడ్డి దిగిపోతే నేనే ముఖ్యమంత్రి అవుతాననే దురాశతో చుస్తున్నటువంటి వ్యక్తి వారిద్దరికి నెల్లూరు జిల్లా ప్రజలు తగిన బుద్హి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనం సోదరులు మాట్లాడుతూ మేము గెలిచింది రాజశేఖర్ రెడ్డి  బొమ్మ మీద కాదు సోనియా బొమ్మ మీదనా అన్నారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ఇప్పుడే కాదు వచ్చే 17 ఉప ఎన్నికల్లో కూడా వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  కైవసం చేసుకుంటుంది.

తాజా వీడియోలు

Back to Top