స్పీకర్: నల్లా సూర్యప్రకాష్, జూలై 16, 2012

ఆర్.డబ్ల్యు.యస్ శాఖలో పదోన్నతులలో అర్హులైన వారిని విస్మరిస్తే సహించేది లేదు.

వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర ఎస్.సి సెల్ అద్యక్షులు నల్లా సూర్య ప్రకాష్ హెచ్చరిక.

ఇటివల ఆర్.డబ్ల్యు.ఎస్ శాఖలో పదోన్నోతులలో ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు రోస్టరులో అర్హులైన వారిని విస్మరించి పద్దొంనతులను చేపట్టారని, అర్హులైన అన్యాయం జరిగితే సహించేది లేదని వారి కొరకు అవసరమైతే ఉద్యమిస్తామని వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర ఎస్.సి సెల్ అధ్యక్షులు నల్ల సూర్య ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత నెల నాల్గవ తేదిన జరిగిన డి.పి.సి సమావేశంలో దాదాపు 76 మందికి పదోన్నతుల కొరకు నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం ఉన్నదని, దీనిలో ఎస్.సి, ఎస్.టి లకు దాదాపు 15మందికి అవకాశం కల్పించాలని ఉండగా కేవలం 7 గురికి మాత్రమే అవకాశం కల్పించడం దురదృష్టకరమని ఇది దళిత ఉద్యోగులు పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష వైఖరికి నిదర్శనమని అయన తీవ్రంగా విమర్శించారు కాగా దీనిలో ఎస్.టి వర్గాల నుండి ఐదుగురికి అవకాశం కల్పించాల్సి ఉండగా కేవలం ఇద్దరికి మాత్రమే అవకశం కల్పించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. రాజ్యంగం దళిత ఉద్యోగులకు కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్.టి, ఎస్.సి ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారికి ఇవాల్సిన న్యాయమైన ఉద్యోగ పదోన్నతులను వారికి కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. అర్హులైన అభ్యర్థులు ఉంది కూడా, భర్తీ చేయకుండా అస్థానలను ఖాళీగా వదిలివేసి (carried farward) తరువాత పథకం ప్రకారం ఆ స్థానాలను అగ్రవర్గాల వారికి కేటాయించే కుట్రను ప్రభుత్వం చేస్తోందని అయన నుండి పడ్డారు. ఎస్.సి, ఎస్.టి వర్గాల హక్కులను కాలగేస్తే ప్రభుత్వాలకు తగిన శాస్తి జరుగుతుందని అయన అన్నారు. ఈ విధంగా ఖాళి ఉండడం(CF) ద్వారా రోస్టరులో ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులు వెనుకబడి, వారి పదోన్నతులతో మరియు ఒనియారిటిలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అయన అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనుకకు సి.ఏష్ గా వదలకుండా భర్తీ చేయాలనీ, తని పక్షంలో వారికి మద్దతుగా ఉద్యమించాల్సి వస్తుందని అయన హెచ్చరించారు. రోస్టరు ప్రకారం రావాల్సిన మొత్తం ఉద్యోగ పదోన్నతులను ఎ.సి, ఎస్.టి ఉద్యోగులకు కల్పించని పక్షంలో తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కొవలసి వస్తుందని అయన హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top