దళితులకు కేటాయించబడిన నిధులు దళితులకు కర్చుపెట్టాలని దానికి ఓ చట్టం చేయాలనే ఉద్దేశంతొ 72 గంటలు ప్రజాసంఘాలతొ నిరాహారదీక్ష ప్రారంబించారు.కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు కలసి వచ్చాయి.నిన్న సాయంత్రం ఉపముక్యమంత్రి దామోదర రాజనర్సింహ గారు భవిష్యత్ ఈ నిధులు దారి మల్లించకుండా చూస్తామన్నారు. ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష తో వ్యవహరిస్తుంది. ఒక పక్క దళితులకి అనుకూలమేనని చెప్పి మరో పక్క ధర్నా చేస్తున్న కార్యకర్తలను కఠినంగా పోలీసులు కొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను కొనసాగిస్తుంది. 3రోజుల నుండి ధర్నా జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం ఐన తెలుగుదేశం కనీసం స్పందించలేదు.అసెంబ్లీలోదళితుల,ఆదివాసీల బడ్జెట్ మీద చర్చ జరుగకుండా మద్యం పై చర్చ జరిపారు.అటువంటి చంద్రబాబు ఈ రోజు మేము దళితులకు ఎంతో చేస్తామని చెబ్తున్నారు. దళితులో చిచ్చు రేపిన వ్యక్తి చంద్రబాబు. దళితుల మద్య అంతరం ఏర్పడటానికి ముక్య కారణం చంద్రబాబు.మాలలు మాదిగల మద్య ఉన్న విబేధాలను తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అయితే సమస్యను పరిష్కరించేవారు. అలాగే 48 అసెంబ్లీ స్థానాల్లో 24 మాదిగలకు 24 మాలలకు కేటాయించారు. 7 పార్లిమెంట్ స్తానాలుంటే 4 మాదిగలకు 4మాలలకు 1 మాదిగలకు ఇచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజకీయం గా మాదిగలు మాలలు ఎదగడానికి కారణం రాజశేఖర రెడ్డి గారే కారణం. అదే చంద్రబాబునాయుడు గారు మాదిగలకు అన్యాయం జరుగుతుందిఅని చెప్పి దాన్ని ఆసరా చేసుకున్నాడు.కాని మాదిగలకు పని చేయలేదు. దళితుల ఆశలు ఆశయాలు నెరవేరాలంటే అది ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దళితుల ప్రయోజనాల కోసం ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.మానవత్వం లేని ప్రభుత్వం గా చలనం లేని ప్రభుత్వంగా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉంది ఈ ప్రభుత్వ తీరు. పోరాటం ద్వారానే దళితుల హక్కులు సాదిన్చుకోగాలుగుతున్నాం అని 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. రెండు మూడు వేల కోట్ల ఉన్న జనాభా ఉన్న దళితులు ఒక్కటైతే దళితుల పట్ల వ్యతిరేఖంగా ఉన్నపార్టీలు పార్లిమెంట్లో అసెంబ్లీలో ఎలా అడుగుపెడతాను అని అడుగుతున్నాం. ఈ రోజు సిగ్గులేకుండా చంద్రబాబు దళితుల గురించి మాట్లాడుతున్నారు.9 సంవత్సరాలకు గాను దళితుల కోసం మీరు ఏం చేసారని అడుగుతున్నాం.