స్పీకర్ : శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ -ఫిబ్రవరి 24,2012

అసెంబ్లీలో ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ... అధికారపక్ష పాత్రలో అటు చంద్రబాబునాయుడు గారు ప్రతిప్రక్ష పాత్రలో రక్తి కట్టించారు, వారి నటన అసమానంగా ఉంది.

ఎమ్మార్ కేసులో చంద్రబాబు జైలుకు పోవలసిన వ్యక్తి అని సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి అనటం మరియు సి.ఎం. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన వైనం చూస్తే ఒక సామెత గుర్తుకువస్తుంది "నీవు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా ఉంది." అసలు జైలుకు వెళ్ళాల్సిన వ్యక్తిని, జైలుకు పోకుండా సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నాడన్న విషయం అయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది.

రెండవ విషయం: ఈ రోజు చంద్రబాబు గారు మరొకసారి దివంగతనేత రాజశేఖర్ రెడ్డి పిల్లల పెంపకం గురించి విమర్శిస్తూ నాకొడుకు స్టాన్ఫోర్డ్  యూనివెర్సిటి చదువుతున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నట్లు మాట్లాడారు. ఇది చాలా స్వార్ధపూరిత ఆలోచన. నిజానికి చూస్తే రాష్ట్రంలో ఎంతోమంది పేదరికం నుంచి చదువు చెప్పించలేని లక్షల కుటుంబాలు ఉన్నాయి అని గుర్తించి ప్రతి పేదవాని కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదువుకొని విద్యావంతులు కావాలనే ఏకైక లక్షంతో, ప్రభుత్వం ఎంత భారం పడినప్పటికీ, ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయంబర్స్ మెంట్ పధకం ప్రవేశ పెట్టి లక్షల్లో విధ్యార్డులని చదివించగల్గామని ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్త పరిచారు.

కానీ ఈ నాడు చంద్రబాబునాయుడు కేవలం తన కుమారుడి చదువు కొరకు ఒక కార్పోరేట్ కింగ్ రామలింగరాజు దగ్గర నుండి 60కోట్లు ఫీజు రీయంబర్స్ మెంట్ ఉపయోగించుకున్నందుకు సంతోషపడుతున్నాడు. దీనిని బట్టి దివంగతనేత రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనా విధానాన్ని మరియు చంద్రబాబునాయుడు గారి యొక్క స్వార్దపూరితమైన ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనించుకోవాలి.

ఈనాడు చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివెర్సిటిలో చదువికి ఆయనే ఫీజు కట్టినట్టు,ఆ యూనివెర్సిటి నుండి క్లీన్ చీట్ వచ్చినట్టు చెప్పుకొచ్చారు,అదే నిజమైతే చంద్రబాబునాయుడు తన ఐ.టి. రిటన్స్ ను మరియు  బ్యాంకు స్టేట్ మెంట్/ఓచర్ బహిరంగంగా ప్రకటించాలని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పేర్కొన్నారు.

వాస్తవానికి నేడు రాష్ట్రంలో కరెంట్ చార్జీలు వేలకోట్లలో పెంచినా,ఆర్టీసి చార్జీలు ఘోరంగా పెరిగినా,మద్యం సిండికేట్లలో  రాష్ట్రం దోపిడికాబడుతున్న,చివరకు 104,108,ఆరోగ్యశ్రీ పధకాలు కధలకపోయినా వాటి మీద ఇటు ముఖ్యమంత్రి గాని, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుగాని మాట్లాడంలేదంటే ప్రజలంతా వీరియొక్క వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్లో వీరిద్దరికి సరైన గుణపాఠం చెప్తారు.

Back to Top