వైయస్ జగన్, రాష్ట్ర హితం కోరుతూ రేపు ఇష్ట దైవాల ప్రార్థన

 విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో
జరిగిన హత్యాయత్నం నుంచి దేవుడి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో అధ్యక్షుడు
వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్షేమంగా బయటపడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు, వైయస్ఆర్ కాంగ్రెస్
అభిమానలు, కార్యకర్తలు, నాయకులంతా వారి ఇష్ట
దైవాలను ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు
పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం నాడు పత్రికా ప్రకటన విడుదల
చేసింది. 

తొమ్మిదేళ్లుగా వైయస్ జగన్‌ను
ఎదుర్కోలేని వారే ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతోందని  విమర్శించింది. వైయస్‌ జగన్‌పై
దాడి జరిగిన వెంటనే సానుభూతి కోసం జరిగిదంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం సిగ్గుచేటని
పేర్కొన్నది. ఇందుకోసం టీడీపీ ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని ఆరోపించింది.
సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన
తనయుడు లోకేశ్‌, డీజీపీ
ఆర్పీ ఠాకూర్‌లు.. ఈ ముగ్గురు ప్రధాన సూత్రధారులుగా జరుగుతున్న కుట్రలపై..
నిజాయితీపరులైన అధికారులతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌
 పార్టీ డిమాండ్ చేసింది.

 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top