<strong>హైదరాబాద్: </strong>పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు కీలకమైన కమిటీలు ఏర్పాటయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా పార్టీ సభ్యత్వ నమోదు కమిటీని, పార్టీ పి.ఎ.సి. సభ్యుడు డి.ఎ.సోమయాజులు కన్వీనర్‌గా మానవ వనరుల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.<br/>సభ్యత్వ నమోదు కమిటీలో పిఎన్‌వి ప్రసాద్, డి.రవీంద్రనాయక్, బండారు మోహన్‌రెడ్డి, జి.వి.సుధాకర్‌రెడ్డిని సభ్యులుగా నియమించారు. మానవ వనరుల అభివృద్ధి కమిటీలో బి.జనక్‌ప్రసాద్, కుంభా రవిబాబు, విజయా శారదారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, చేగొండి వెంకట హరిరామ జోగయ్య ఉంటారని సుబ్బారెడ్డి వెల్లడించారు.