అధికారపార్టీకి, మహిళకు మధ్య పోరాటం

రాజకీయంగా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు
చేయని తప్పుకు క్షమాపణ ఎలా చెబుతారు
తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు దూషించినా చర్యలు తీసుకోరా
కా.మ అని ఈనాడు కూడా రాసింది..చర్యలు ఎందుకు తీసుకోరు
టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన రోజా

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన క్లిప్పింగ్ లు వేస్తూ ఎల్లో మీడియా తనను అవమానించడంపై రోజా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను, అరాచక పనులను ఎత్తిచూపినందుకే అసెంబ్లీ నుంచి తనను కక్షపూరితంగా సస్పెండ్ చేశారని రోజా నిప్పులు చెరిగారు.  చేయని తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదని రోజా స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.  సస్పెన్షన్ పై న్యాయస్థానంలో న్యాయపోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. సస్పెన్షన్ అన్నది అధికారపార్టీ పురుష అహంకారానికి, మహిళకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంగా రోజా అభివర్ణించారు. మహిళా సమస్యల మీద పోరాడుతుంటే తట్టుకోలేకనే చంద్రబాబు తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని రోజా ఫైరయ్యారు . రికార్డ్ లు బయటకు తీస్తే..ఎవరు ప్రజాసమస్యల మీద మాట్లాడారు. ఎవరి తిట్టడమే పనిగా పెట్టుకున్నారో తెలుస్తోందన్నారు.  అధికారపార్టీ నేతలు దోషిగా తేలుతారని కుండబద్ధలు కొట్టారు. 

రాజకీయంగా తనను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు న్యాయం జరిగేందుకు గొంతు విప్పిన తనపై అన్యాయంగా కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు దళిత మహిళా ఎమ్మెల్యేలను పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం ఉన్న ఇంటి దగ్గరే,  కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహిళలను  వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ప్రశ్నిస్తే... ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ సస్పెండ్ చేశారన్నారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశానికి సంబంధించి 17వ తేదీన 344 కింద వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చామని రోజా పేర్కొన్నారు. 3 కోట్ల మంది మహిళలకు సంబంధించిన ఈ విషయమంమీద..చర్చ కోసం అడిగితే రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి సభలోకి వచ్చాక అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చి, దాన్ని పక్కదోవ పట్టించారని రోజా తెలిపారు. 18వ తేదీ మరోసారి ఇదే అంశంపై నోటీసు ఇచ్చామని, అంబేద్కర్ కూడా ఇలాంటి అంశంపై చర్చ సాగించాలనే చెప్పేవారని రోజా అన్నారు. మహిళను ఓటర్లుగా కాదు మనుషులుగా చూడండి అని తాము అడిగితే... అంబేద్కర్ ఆత్మ కూడా క్షోభించేలా 58 మందిని 344(2) ప్రకారం సస్పెండ్ చేశారని రోజా చెప్పారు. అదే సమయానికి అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరం చూశామన్నారు. 

జరిగింది చెప్పుకోవడానికి అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వస్తే మార్షల్స్ తో గెంటించి వేశారని, తన ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధమయ్యారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పార్టీని సేవ్ చేసుకోవడానికి అనితను పావుగా వాడుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. గతంలో ఇదే మాదిరి తమను వైఎస్సార్, చిరంజీవి మీదకు ఉసిగొల్పిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు, మంత్రి యనమల, స్పీకర్ లకు అనిత అంటే ఎందుకంత ఇంట్రస్ట్ అని చురక అంటించారు. 

అధికారం కోసం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ముఠానే, వంగవీటి మోహనరంగాను చంపించిన ముఠానే. ఇప్పుడు తనను సస్పెండ్ చేసిందని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  వనజాక్షి, రిషేతేశ్వరి మృతి  , పుష్కరాల్లో చనిపోయిన వారి విషయంలో, నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో, కా.సెక్స్ రాకెట్ పై, కల్తీమద్యం విషయంలో..అధికారపార్టీ పరువు తీస్తుందన్న అక్కసుతోనే టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని రోజా ఎత్తిపొడిచారు. 

అంగన్ వాడీలు, రిషితేశ్వరిలకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతుంటే మంత్రితో సంబంధం లేకుండా అనిత మాట్లాడుతోంది. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే  పీతల సుజాత వీళ్లకేం పనిలేదని మాట్లాడుతోంది. నారాయణ కాలేజీలో విద్యార్థులు చనిపోతుంటే దాని గురించి  పట్టించుకోకుండా అధికారపార్టీ నేతలు నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పాల్పడిన వారు బాబు పక్కనే కూర్చున్నారు. తప్పతాగి ఓ మహిళపై రావెల సుశీల్ లైంగిక వేధిపులకు పాల్పడినా రావెల కిషోర్ ను తొలగించడం లేదు. ఓ టీడీపీ ఆర్టిస్టు ఆడియో ఫంక్షన్ లో అన్న మాటలకు సారీ చెప్పాలని అడిగితే..మహిళలను సంతోషపర్చడానికి మాట్లాడారని అనిత అంటోంది. టీడీపీ నేతలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని స్పీకర్ ను రోజా నిలదీశారు.

సస్పెన్షన్ తప్పు అని కోర్టు క్లియర్ కట్ గా చెబితే మళ్లీ డివిజన్ బెంచ్ కు ఎందుకు వెళ్లారు. చట్టసభ నిర్ణయాల్లో న్యాయస్థానాలకు జోక్యం లేదన్న మీరు..మళ్లీ ఎందుకు అప్పీల్ కు వెళ్లారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని చెప్పే మీరు కోర్టు ధిక్కారానికి ఎందుకు పాల్పడ్డారని  రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు.  రూల్ తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు.  ఎంతో అనుభవమున్న యనమల రూల్ తప్పు చెప్పారంటే ఏవరైనా నమ్ముతారా..? అని రోజా ప్రశ్నించారు. ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయనందువల్లే, అసెంబ్లీకి రానీయకపోవడం వల్లే కోర్టుకెళ్లానన్నారు.

రికార్డుల్లో లేని విషయాలను, అనని మాటలను అన్నట్లు చూపిస్తున్న ఏబీఎన్ ను శిక్షించాలి.  ఇష్టమొచ్చినట్లు తిట్టిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ ఇచ్చే సీడీలను పట్టుకొని వల్గర్ గా  చూపిస్తున్న ఎల్లోమీడియాపై చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేసిన కాల్వ శ్రీనివాసులను ప్రివిలేజ్ కమిటీకి పిలిపించి కఠినంగా శిక్షించాలి. అసెంబ్లీ ప్రోసీడింగ్స్ ను దొంగిలించిన వారిని శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. న్యాయం కోసం చివరి వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తాను రెండు సార్లు కోర్టులో, ఓ సారి హాస్పిటల్ లో ఉండడం వల్ల కమిటీకి హాజరు కాలేదన్నారు. ప్రివిలేజ్ కమిటీకి వచ్చి అన్ని వాస్తవాలు చెబుతానన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తానెక్కడా నోరు జారలేదని రోజా చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు తన సొంత ఖర్చులు వెచ్చించి పనిచేశానన్నారు.  చంద్రబాబు సంతోషపడతారనో, మంత్రిపదవులు వస్తాయనో తిట్టాలనుకుంటే  ఎంజాయి చేసుకోండి. అంతేగానీ తప్పుడు పనులు మీరు చేస్తూ వాటిని మాపై రుద్దితే మాత్రం తగిన మూల్యం తప్పదని రోజా  అధికారపార్టీనేతలను హెచ్చరించారు.  తాను కులాన్ని ఎప్పుడూ పేరు వెనకాల వాడుకోకున్నా...రోజా రెడ్డి అంటూ టీడీపీ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. 



To read more details in English:     http://goo.gl/b7pRbg 



Back to Top