ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం

విజయవాడ:    ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. చిట్టినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ చరిత్రలో ఇక్కడ ప్రజలు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని విజయవాడ కాకపోయినా రాజకీయ రాజధాని ఇదే అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ క్షణం వరకు ప్రజలందరూ కూడా వైయస్‌ జగన్‌ వెంట నడిచారన్నారు. ఈ విజయవాడ ప్రజలందరూ వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారన్నారు. ఈ నగరంలో సామాన్యులు బతకాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పలకాలన్నారు.  
 
Back to Top