గుంటూరు: ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 115వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం విరామం ప్రకటించిన పాదయాత్ర సోమవారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో తిరిగి ప్రారంభమవుతుంది. పెద్దివారిపాలెం క్రాస్ మీదుగా కొనసాగిన యాత్ర కొమ్మూరుకు చేరుకుంటుంది. కొమ్మూరులో మానవహారంలో వైయస్ జగన్ పాల్గొన్న అనంతరం అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన పాదయాత్ర పెదనందిపాడు శివారుకు చేరుకుంటుంది. పెదనందిపాడులో వైఎయ జగన్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. జననేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1,528 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.