అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుత్తి పట్టణానికి రానుండటంతో నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో గుత్తి పట్టణం జనసంద్రమైంది. అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.