కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 16 రోజు పాదయాత్ర షెడ్యూలు ఖరారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం నరసాపురం క్రాస్ రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు నరసాపురం క్రాస్ రోడ్డు నుంచి జననేత పాదయాత్ర మొదలవుతుంది. 9.30 గంటలకు రామల్లేపల్లేకు చేరుకుంటారు. 11 గంటలకు బోయనపల్లె క్రాస్‌కు చేరుకుంటారు. 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వైయస్ జగన్ పాదయాత్ర మొదలవుతోంది. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తికి చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది.