అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం పాపంపేట గ్రామంలో భారీ బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. జననేత వైయస్ జగన్‌ను చూసేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరుకావడంతో పాపంపేట జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.