<br/>గుంటూరు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి మండలం సుందరయ్య కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను జననేత వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తుందని, రోడ్లు సరిగా లేవని వాపోయారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని వైయస్ జగన్ భరోసా కల్పించారు.