కర్నూలు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం 11.15 గంటలకు పత్తికొండ నియోజకవర్గంలోని బోయినపల్లె క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కాగా అక్కడి నుంచి రామల్లెపల్లె మీదుగా బోయినపల్లి క్రాస్ రోడ్డు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడ్డుకు చేరుకుంటారు.