<br/>కర్నూలు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్ ఖారారు అయ్యింది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జుటూర్, చిన్న హుల్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పత్తికొండలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.<br/><br/>