కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండల కేంద్రానికి ఇవాళ మధ్యాహ్నం చేరుకుంది. ఉదయం నియోజకవర్గంలోని గొర్లగుట్ట గ్రామం నుంచి ప్రారంభమైన జననేత ప్రజా సంకల్ప యాత్ర షేక్‌షావలి దర్గా మీదుగా బేతంచెర్లకు చేరుకుంది. భోజన విరామం అనంతరం పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.