అలుపెరుగని జైత్రయాత్ర

కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత 

శ్రీకాకుళం : నవ్యాంధ్ర ప్రగతే లక్ష్యంగా, పేదసామాన్య వర్గాల సంక్షేమమే పరమావధిగా నవరత్నాల్లాంటి పథకాలను వెంటబెట్టుకుని సాగుతున్న జగన్‌మోహనుడి జైత్రయాత్ర  పలాస నియోజకవర్గంలో కొన‌సాగుతోంది. కాలినడకన వేలాది కిలోమీటర్లు పర్యటించి కోట్లాది జనుల గోడును ఆలకించి, వారి బంగరు భవిష్యత్‌కు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత జిల్లాలో ఇంతవరకు 8 నియోజకవర్గాల్లో 223.2 కిలోమీటర్లమేర ప్రజాసంకల్పయాత్ర సాగించారు. చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు, అక్రమాలతో నరకం అనుభవిస్తున్న ప్రజలను కలిసి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి బాధలను తెలుసుకుంటున్నారు.

ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక బాధలతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు తదితర ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాధ్యమైన హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. గత నెల 25న పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామం వద్ద ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా యాత్ర పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం తదితర ఎనిమిది నియోజకవర్గాల్లో దిగ్విజయంగా  పూర్తయింది.  

తాజా వీడియోలు

Back to Top