ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @3400 కిలోమీట‌ర్లు



శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ మహా సంకల్పంలా ముందుకు సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. నేనున్నానని భరోసా ఇస్తూ.. ముందుకుసాగుతున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని అధిగ‌మించింది. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుండ‌గా గురువారం సాయంత్రం ఎచ్చెర్ల స‌మీపంలో 3400 కిలోమీట‌ర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సంద‌ర్భంగా గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించి, అక్క‌డ మొక్క‌ను నాటారు.  

వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయన పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణతోనే చంద్రబాబు పాలన అంతానికి అంకురార్పణ జరిగిందని అంటున్నారు.  ప్రతిపక్ష నేతగా వైయ‌స్‌ జగన్‌ విజయం సాధించారని పేర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు పాలనను వైయ‌స్ఆర్‌  ఎలా అంతమొందించారో.. ఇప్పుడు అలానే వైయ‌స్‌ జగన్‌ పునరావృతం చేస్తారని  స్థానికులు అంటున్నారు. 

కిలోమీటర్ల వారీగా పాదయాత్రలో ఘట్టాలు
3400 కిలోమీట‌ర్లు శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ఎచ్చెర్ల స‌మీపం(06 డిసెంబ‌ర్‌, 2018)
3300 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నియోజ‌క‌వ‌ర్గం జియ్య‌మ్మ‌వ‌ల‌స మండ‌లం(24. న‌వంబ‌ర్‌, 2018)
3200 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలురు నియోజ‌క‌వ‌ర్గం బాగువ‌ల‌స‌(అక్టోబ‌ర్‌24, 2018)
3100 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ (అక్టోబ‌ర్,8,2018)
3000 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌. కోట నియోజ‌క‌వ‌ర్గంలోని దేశ‌పాత్రునిపాలెం(సెప్టెంబ‌ర్‌24, 2018) 
2900 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా స‌బ్బ‌వ‌రం (సెప్టెంబ‌ర్ 5, 2018)
2800 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా యలమంచిలి (ఆగ‌స్టు 24, 2018)
2700 కిలోమీట‌ర్లు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగ‌స్టు11, 2018)
2600 కిలోమీట‌ర్లు తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌( జులై 8, 2018)
2500 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2400 కిలోమీట‌ర్లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం క్రాస్ వ‌ద్ద (జూన్ 21, 2018)
2300 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు ‍క్రాస్‌ రోడ్డు వద్ద  2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ 24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైయ‌స్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017)  
Back to Top