–వైయస్‌ఆర్ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం..–చంద్రబాబు చెప్పినా ఏ పనులు జరగలేదు.. – శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటీ? – రిమ్స్ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు– శ్రీకాకుళంలో రింగ్ రోడ్డు అన్నారు..కనిపించిందా?– టీటీడీ కళ్యాణ మండపం కోసం వైయస్‌ఆర్ భూమి, నిధులు ఇచ్చారు– బీదల కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని టీడీపీ ఆఫీస్‌కు ఇచ్చారు– శ్రీకాకుళం జిల్లాలో త్రిపుల్ ఐటీ పరిస్ధితి దారుణంగా ఉంది– రూ.3 లక్షల ప్లాటు చంద్రబాబు పేదలకు రూ.7.80 లక్షలకు అమ్ముతున్నారు– 119 మంది మత్స్యకారులు చనిపోతే ఎవరికి పరిహారం అందలేదు.– అగ్రిగోల్డు బాధితులకు చంద్రబాబు ఇంకెప్పుడు న్యాయం చేస్తారు?– తుపాను బాధితులను చంద్రబాబు ఆదుకున్నారా? – ఒడిశా సీఎం తీసుకున్న చర్యలు, మన సీఎం చర్యలకు చాలా తేడా ఉంది– రాష్ట్రంలో సహకార డయిరీలన్ని మూతపడే పరిస్థితి ఉంది– రాష్ట్రంలో వైద్య రంగం భయానక పరిస్థితిలో ఉంది– దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను మూసివేయిస్తున్నారు– ఆలయాల్లో పారిశుద్ధ్య పనులు తన బినామీకి చంద్రబాబు అప్పజెప్పారు– గ్రామాల్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం– ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తాం– ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసింది– హోదా తెస్తానని బాబు మోసం చేశారు..– రాష్ట్రంలోని ఏ పార్టీలను నమ్మవద్దు– ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయ్యండి
శ్రీకాకుళం: ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమిస్తామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వాలంటీర్‌గా ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.5 వేలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా మీ మీ ఇంటికే వచ్చేలా చేస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఊరులో గ్రామ సెక్రటేరియట్ తీసుకువస్తామని, అదే గ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గ్రామ సెక్రటేరియట్ ద్వారా మరో 1.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ..వైయస్ జగన్ మాటల్లోనే..
– గడిచిన 35 సంవత్సరాల రాజకీయాలు చూస్తే..ఓట్లు సీట్లు చూస్తే..శ్రీకాకుళం జిల్లా టీడీపీకి నంబర్ వన్..కానీ మన ఖర్మ ఏంటంటే అభివృద్ధిలో అన్నింటికంటే చివరి స్థానంలో ఉంటుంది. ఒక్కసారి 2004లో శ్రీకాకుళం జిల్లా ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చి, ఈ జిల్లా తలరాతలు రాసే నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గెలిపించారు. ఆ తరువాత నాన్నగారు చేసిన పనులను చూసి వైయస్‌ఆర్‌పై నమ్మకంతో మళ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు 9 స్థానాలు వైయస్‌ఆర్‌కు ఇచ్చారు. నాన్నగారి పనులను ఇప్పటికీ నా వద్దకు వచ్చి చెబుతుంటే నాన్నగారి కొడుకుగా పుట్టడం గర్వంగా ఉందని, ఇదిపూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.– 2014 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించామన్నా..ఏడు స్థానాలు టీడీపీకి ఇచ్చామన్నా..ఇవి సరిపోవన్నట్లుగా మరో ఎమ్మెల్యేను సంతలో పశువులా కొనుగోలు చేశారన్నా అని చెప్పారు. ఇంత మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని చంద్రబాబు మా జిల్లాకు ఏం చేశారన్నా అని ప్రశ్నిస్తున్నారు.– ఓడిశాతో ఎన్నో ఏళ్లుగా తీవ్ర వివాదం ఉంది. ఏ రోజు కూడా చంద్రబాబు మా సమస్యలపై పట్టించుకోలేదు. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత న్యాయపరమైన చిక్కులను తొలగించి వంశాధార ప్రాజెక్టుకు 33 కిలోమీటర్లు కెనాల్ నిర్మించి నీరు తెప్పించారు. స్టేజ్–2 ప్రాజెక్టు పనులు 2005లో చేపట్టారు. 930 కోట్లు కేటాయించి నాన్నగారు బతికుండగానే రూ.700 కోట్లు కేటాయించి పనులు పరుగులు తీయించారన్నా..మరో రూ.175 కోట్లు చంద్రబాబు సీఎం కాకముందే కేటాయించారు. మిగిలిపోయిన పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా అవినీతి ప్రాజెక్టుగా మార్చారని చెబుతున్నారు. రూ.55 కోట్ల పనులకు అంచనాలు పెంచి తన బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్వీక్ కంపెనీకి దోచి పెడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. వంశాధార వివాదానికి ముగింపు పలుకుతూ..సుప్రీం కోర్టు ఇటీవల ఉత్తర్హులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.– మహేంద్ర తనయ ప్రాజెక్టుపనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. మహానేత కుమారుడిగా చెబుతున్నాను. వంశాధార ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను.– అన్నా..ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. ఎవరూ కూడా మాజిల్లాను పట్టించుకోలేదు. మా జిల్లాకు మెడికల్ కాలేజీ లేదని ఒక్క వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమే గుర్తించి రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించారు. అదే రిమ్స్ పరిస్థితి ఎలా ఉందో అని ప్రజలు చెబుతున్నారు. ఇది 500 పడకల ఆసుపత్రి..ఇందులో 150 మంది మాత్రమే పని చేస్తున్నారని చెబుతున్నారు. సిటీ స్కాన్ రిపేరీలో ఉంది. ఎంఆర్‌ఐ లేదు. రోడ్డు ప్రమాదానికి ఎవరైనా గురైతే దిక్కు లేదు. మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడానికి ఎంసీఏ అధికారులు అనుమతి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. అధ్వాన్నంగా కాలేజీ నడుపుతున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏదైనా అడిగితే డబ్బులు ఇవ్వమని చెబుతోంది.– ఇదే జిల్లాలో ఒక యూనివర్సిటీ పెట్టాలని ఏ సీఎం కూడా ఆలోచన చేయలేదు. నాన్నగారు సీఎం అయ్యాక అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయించారు. ఈ యూనివర్సిటీలో 16 డిపార్టుమెంట్‌లు ఉంటే అందులో కేవం 12 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. పోస్టులు మంజూరు చేయడం లేదు. స్కాలర్ షిప్‌లు ఇవ్వరు. ఇవన్నీ చేయకుంటే వీరికి శ్రీకాకుళం జిల్లాలో ఏం ప్రేమ ఉందో చూడండి అంటున్నారు.– నాన్నగారి గురించి ఇక్కడి ప్రజలు గొప్పగా చెప్పారు. అలాగే చంద్రబాబు 2014లో సీఎం అ య్యారు. సీఎం స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా మా జిల్లాకు హామీ ఇచ్చారన్నా..మా జిల్లాకు సంబంధించి పనులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. – కాకుళంలో స్మార్ట్ సిటీ అన్నారు..ఎక్కడైనా కనిపించిందా?..రూ.348 కోట్లు ఇస్తామన్నారు. ఇంతవరకు కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. అండర్ గ్రైండ్ డ్రైనేజీ..రింగ్ రోడ్డు ఎక్కడైనా కనిపించిందా?. జిల్లాలో ఎయిర్ పోర్టు అన్నారు..ఫుడ్ పార్క్ ఎక్కడైనా కనిపించిందా? స్కూల్ ఆఫ్ ప్లానింగ్, అర్కిటô క్ ప్రాజెక్టు, నాగావలి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కోడి రామూర్తి స్టేడియం తిరిగి కడుతామని శంకుస్థాపన చేశారు. నాలుగున్నరేళ్లు అవుతుంది ఆ స్టేడియం కట్టారా? బీదల సంక్షేమం కోసం గతంలో ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే..ఆ భూమిని టీడీపీ ఆఫీస్‌కు కేటాయించారు. – టీటీడీ కళ్యాణ మండపం కోసం అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డి భూమి కేటాయించారు. నిధులు మంజూరు చేశారు. చ ంద్రబాబు సీఎం అయ్యి నాలుగేళ్లు అవుతుంది. ఇంతవరకు అంగుళం కూడా నిర్మించలేదు. బాబు గారు వచ్చాక ఈ జిల్లాలో జరిగింది ఏంటంటే..అక్షరాల 271 స్కూల్స్ మూత వేయించారు. ఈ నియోజకవర్గంలో మూడు హాస్టల్స్, జిల్లాలో 40 హాస్టల్స్ మూత పడ్డాయి.– శ్రీకాకుళం జిల్లా త్రిపుల్ ఐటీ తీసుకుంటే చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 2016లో ఆర్భాటంగా ఈ జిల్లాకు త్రిపుల్ ఐటీ ఇస్తున్నానని ప్రకటించారు. ఇంతవరకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. చివరకు ఇక్కడి పిల్లలను నూజీవీడుకు తీసుకెళ్లారు. ఇటీవల ఆ స్కూల్‌ను ఇక్కడికి తీసుకొచ్చి మూతపడిన ఇంజినీరింగ్ కాలేజీలో పెట్టారు. ఇలాంటి వ్యక్తి సీఎం పదవికి అర్హుడా?– నాన్నగారి పాలన గురించి ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదే జిల్లాలో నాన్నగారు అక్షరాల 11 వేల ఇళ్లులు కట్టించారు. చంద్రబాబు పాలనలో ఇళ్ల పేరు చెప్పి స్కామ్‌లు చేస్తున్నారు. శ్రీకాకుళం టౌన్‌లో ప్లాట్లు కట్టిస్తామని అపాయింట్‌మెంట్ కట్టిస్తున్నారు. అక్కడ లిప్టు లేదు. మార్బుల్ ప్లోర్ లేదు. ఇలాంటి అపాయింట్‌మెంట్‌లో అడుగుకు వెయ్యి ఖర్చు అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం అడుగుకు రూ.2600 చొప్పున పేదలకు అమ్ముతున్నారు.రూ.3 లక్షలు ఖర్చు అయ్యే ఈ ప్లాట్‌ను చంద్రబాబు రూ.7.80 లక్షలకు పేదలకు అమ్ముతున్నారు. ఇందులో రూ.1.50 కేంద్రం, మరో రూ.1.50 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన రూ.4.80 లక్షలు పేదవాడు 30 సంవత్సరాల పాటు కడుతూ పోవాలట. చంద్రబాబు లంచాలు తీసుకుంటే..బ్యాంకులకు మాత్రం పేదవాడు కంతులు కట్టాలట. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఈప్లాట్లను పేదలకు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు. ఆ ప్లాట్లు తీసుకోండి. ఆ తరువాత దేవుడు ఆశీర్వదించి. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ..మీ అందరికి మాట ఇస్తున్నాను. జగన్ అనే నేను..ఆ ప్లాట్ల మీద ఉన్న అప్పును మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను.– చంద్రబాబు పరిపాలనలో ఎంతటి అన్యాయం, అవినీతి జరుగుతోందో అని చెబుతూ..హుద్‌హుద్ బాధితులకు 120 ఇళ్లు కట్టించారన్నా..బాధితులకు కాకుండా పచ్చ చొక్కాలకు ఇస్తున్నారన్నా..ఎవరికి ఇస్తున్నారో కూడా జాబితా బయటపెట్టడం లేదన్నా అంటున్నారు. – మత్స్యకారులు నా వద్దకు వచ్చి అన్నా..189 మంది మత్స్యకారులు చనిపోతే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నా..ఏ ఒక్కరికీ కూడా ఇంతవరకు పరిహారం అందలేదని చెబుతున్నారు. ఇంతటి దారుణంగా మోసం చేస్తున్నారని చెబుతున్నారు.– ఇక్కడ తిరుగుతున్నప్పుడు అగ్రిగోల్డు బాధితులు, కేశవరెడ్డి స్కూల్ బాధితులు వచ్చారు. ఇదే జిల్లాలో అగ్రిగోల్డు బాధితులు 2.80 లక్షల మంది డిపాజిట్లు చేయించుకున్నారు. కేశవరెడ్డి బాధితులు కూడా ఉన్నారు. వీరి కేసులు విచారణ చేసేది సీఐడీ అధికారులట. వీరు బాబు గారిని కాపాడేందుకు పని చేస్తున్నారు. బాధితులకు అండగా నిలవాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. పేదవాడికి చెందాల్సిన ఆగ్రిగోల్డు ఆస్తులను ఎలా కొట్టేయాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. – ఇదే నియోజకవర్గంలో రాజీవ్ స్వగృహా ఇళ్లు కనిపించాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని అప్పట్లో 130 ఎకరాల్లో ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టారు. వైయస్‌ఆర్‌కు పేరు వస్తుందని అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. నీరు లేదు. రోడ్లు లేవు. ఇటువంటి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నాను.– ఇదే నియోజకవర్గంలో కూడా తిత్లీ తుఫాను వచ్చింది. ఇవాళ పరిస్థితి గమనిస్తే..తుపాను బాధితులను చంద్రబాబు ఆదుకున్నాడా? తుపానుకు ముందు సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నారో గమనిస్తే..పక్కన ఒరిస్సా సీఎం తీసుకున్న తీరు..మన సీఎం తీరు చూస్తే నక్కకు నాగలోకానికి తేడా కనిపిస్తుంది. తుపాను వచ్చి 14 రోజులైనా కూడా ప్రజలకు పులిహోరా ప్యాకేట్లు ఇవ్వలేని అధ్వాన్నమైన ప్రభుత్వాని చూశాం. పది రోజులకూ మంచినీరు ఇవ్వలేదు. ఇళ్లకు కరెంటు ఇవ్వలేదు. ఇచ్చాపురం, ఫలాస, టెక్కలిలో వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా చేయడం లేదు. ఇదే జిల్లాకు చెందిన కళా వెంకట్రావ్ విద్యుత్ శాఖకు మంత్రిగా ఉన్నారు. తుపాను కారణంగా రూ.3435 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇందులో చంద్రబాబు ఇచ్చింది కేవలం 15 శాతం అంటే రూ.550 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ఖర్చు చేసింది రూ.250 కోట్లు మాత్రమే. ఏ ఆర్టీసీ బస్సు చూసినా, విజయవాడ నగరంలో చంద్రబాబు ప్లేక్సీలు కనిపిస్తున్నాయి. తుపాను బాధితులను గొప్పగా ఆదుకున్నారని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. చంద్రబాబు తీరు చూస్తే ..శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్లుగా ఉంది. – ఇది ప్రజా పరిపాలన కాదు..ఏపీలో మాఫియా రాజ్యం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ రంగాలను పూర్తిగా పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు. వాటి వెన్ను విరుస్తున్నారు. బినామీలపై ఆధారపడేలా చేస్తున్నారు. రాజధాని భూముల నుంచి మొదలైతే..తినే భోజనం, ఆసుపత్రులు, కేబుల్ టీవీలు అన్నీ కూడా చంద్రబాబు తన బినామీలకు అప్పగిస్తున్నారు. ఏదైనా సంస్థలను పునరుద్ధరించాలి. ఉద్యోగాలు ఇప్పించాలి. పిల్లలకు మేలు చేయాలని ఆలోచన చేయాలి. కానీ చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టి చదువుకుంటున్న మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు.– రాజధాని భూముల్లో చంద్రబాబు చేసిన రాజనీతి ఏంటో గమనించండి. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. రాజధాని ఎక్కడ వస్తుందో తన బినామీలకు ముందుగానే చెప్పి భూములు కొనుగోలు చేయించారు. ఆ తరువాత ల్యాండ్ ఫూలింగ్ ద్వారా తీసుకున్న భూములను తన బినామీలకు కట్టబెట్టారు. రాజధాని ప్రాంతంలో ఎవరైనా కూడా తాను చెప్పిన చోటే హోటళ్లు పెట్టుకోవాలట. బినామీలకు కప్పం కట్టే పరిస్థితికి తీసుకెళ్లారు. – చౌక ధరలకు సరుకులు అందించే రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడం లేదు. తన హెరిటేజ్ కంపెనీల కోసం ప్రజల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి మూడు, నాలుగు రేట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. హెరిటేజ్ కంపెనీ పాలనే తాగాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. చిత్తూరు డయిరీ, ఒంగోలు డయిరీలు మూతపడుతున్నాయి. చంద్రబాబు కుట్రలు ఏస్థాయిలో ఉన్నాయంటే తన మనుషులను చైర్మన్లుగా పెట్టి పథకం ప్రకారం మూతపడేలా చేస్తున్నారు. ఒక లీటర్ రైతు నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి, దాంట్లో వెన్న తీసి రూ.25 చొప్పున అమ్ముతున్నారు.– వైద్యరంగం ఇంకా భయానక పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను దగ్గరుండి మూత వేయిస్తున్నారు. ఎక్కరే యూనిట్ ఉండదు. ఉన్నా..సిబ్బంది ఉండరు. ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు. మందులు లేవు. ఆసుపత్రి రంగంలోకి ప్రతి సర్వీస్‌ను తన బినామీలకు అప్పగిస్తున్నారు. మన పిల్లలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారు. కమీషన్లు, వాటాలు దండుకుంటూ మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారు.– స్కూళ్లలో ఇవాళ మౌలిక వసతులు కనిపించడం లేదు. టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు, యూనిఫాం ఆగస్టు వచ్చినా ఇవ్వడం లేదు. మధ్యాహ్నం భోజన పథకంలో నెలల తరబడి బకాయిలు చెల్లించడం లేదు. నిర్వాహకులు అప్పలపాలవుతున్నారు. దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ స్కూళ్లకు వెళ్తే ఏమి రాదని క్రియేట్ చేస్తున్నారు. చదువుల కోసం చంద్రబాబు బినామీలు నారాయణ, చైతన్య స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నారు. యావరేజ్ స్కూల్‌లో మన పిల్లలు చదవాలంటే ఏటా రూ.35 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బులు కట్టలేక అక్కచెల్లెమ్మలు అవస్థలు పడుతున్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొరగా ఇస్తూ..మరో వైపు ఫీజులు పెంచుతున్నారు. యూనివర్సిటీలను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తున్నారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పిల్లలను రోడ్డుపై నిలబెడుతున్నారు. – తిరుపతి నుంచి అన్నవరం వరకు ఏడు ప్రధానమైన దేవాలయాల్లో పారిశుద్ధ పనులు చేసే కాంట్రాక్టర్ భాస్కర్‌నాయుడు. ఈయన చంద్రబాబు బినామీ. ఈయన నాలుగు రేట్లు పెంచి కాంట్రాక్టులు పొందుతున్నారు. – ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు మనిషి నుంచి లారీ రూ.7 వేల చొప్పున ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. లంచాల కార్యక్రమం కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే, కలెక్టర్, మంత్రి, చిన్నబాబు, పెద్దబాబు వరకు లంచాలు ఇవ్వాల్సిందే. మరుగుదొడ్డి కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాను తయారు చేశారు.– నాలుగున్నరేళ్ల టీడీపీ పాలన చూశారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఎలాంటి నాయకుడు మీకు కావాలో ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు..మోసాలు చేసే వారు మీకు నాయకులు కావాలా? ఇలాంటి అన్యాయమైన పరిపాలన పోవాలి. నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. చెప్పింది చేయకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి.– ఈ చెడిపోయిన వ్యవస్థను బాగుపరచాలంటే ఒక్క జగన్ వల్ల కాదు..జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత తీసుకురావచ్చు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో ఉద్యోగాల కోసం మనం ఏం చేస్తామో చెబుతాను.– రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. వాటి కోసం ఎదురుచూశాం. నోటిఫికేషన్ ఇస్తారని కోచింగ్ సెంటర్లకు పంపించి వేలకు వేలు ఖర్చు చేశాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నారు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈ రోజు జాబు రావాలంటే బాబు పోవాలన్న పరిస్థితి వచ్చింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు రిటైర్డు అయిన ఉద్యోగాలు కలిపితే 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే ఏపీపీఎస్ ద్వారా నోటిఫికేషన్‌ఇస్తామని ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. ప్రతి ఏటా కేలెండర్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక డేట్ ఇచ్చి ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తాం. – వ్యవస్థలను పూర్తిగా మారుస్తాం. గ్రామాల్లో ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచం ఇవ్వాల్సిందే. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీయట్ తీసుకువస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి గ్రామంలో పది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సెక్రటరీయట్‌లో కూర్చోబెడుతాం. పింఛన్, రేషన్‌కార్డు, ఇల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇలా ఎదైనా సరే 72 గంటల్లోనే మంజూరు చేయిస్తాం. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. లంచం అన్నది లేకుండా చేస్తా. గ్రామ సెక్రటరీయట్ ద్వారా 1.50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.– ఇవాళ చదువుకుంటున్న మన పిల్లలకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవు. ఏపీపీఎస్‌సీ ద్వారా, గ్రామ సెక్రటరీయట్ ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేయకపోవచ్చు. అందరికీ తోడుగా ఉండేందుకు ప్రతి గ్రామంలో సెక్రటరీయట్ పని చేసేందుకు అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్‌గా నియమించి రూ.5 వేల జీతం ఇస్తాం. తనకు మళ్లీ ఉద్యోగం వచే ్చదాకా గ్రామంలో సేవ చేసే మంచి పని చేస్తారు. బియ్యం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వారి ద్వారానే అందజేస్తాం. ఇన్నీ చేసినా కూడా ఉద్యోగాల సమస్య తీరదని నాకు తెలుసు. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తాం. పరిశ్రమల్లో లోకల్ పిల్లలకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేస్తాం. అప్పుడు పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. – వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, జనసేనను నమ్మొద్దు. వీరంతా కూడా నిరుడు ఎన్నికల్లో మనకు మోసం చేశారు. వీళ్లంతా కూడా వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బీజేపీ మాటిచ్చింది. చంద్రబాబు కూడా తెస్తామన్నారు. వీరిద్దరితో నేను పని చేయిస్తానని పవన్ కళ్యాన్ చెప్పి ఓట్లు వేయించారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి ఉండకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇ స్తామని చట్టం చేయకపోవడంతో మనకు అన్యాయం జరిగింది. మళ్లీ మనల్ని మోసం చేసేందుకు బయలుదేరారు. వేసే ప్రతి ఓటు మనమే వేసుకుందాం. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకుందాం. 25కు 25 ఎంపీలు మనమే తెచ్చుకుందాం. ఆ తరువాత ఎవరు ప్రధాని కావాలో మనమే నిర్ణయిద్దాం. ప్రత్యేక హోదా ఇచ్చిన తరువాతే మద్దతు తెలుపుదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. మనకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ఇది కావాలంటే మీరందరూ ప్రార్థనలు చేయండి. టెంకాయలు కొట్టండి. హోదా తెచ్చుకుంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా నిలవమని కోరుతూ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..